కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి హీరోగా నటించిన తాజా చిత్రం ‘సప్త సాగరాలు దాటి’. కన్నడనాట ‘సప్త సాగర దాచే: ఎల్లో’ పేరుతో విడుదలై సంచలన విజయం అందుకుంది. ఇటీవలి కాలంలో వచ్చిన అద్భుతమైన ప్రేమ కథా చిత్రంగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ సినిమా యువతరాన్ని విశేషంగా ఆకట్టుకుంది. రొమాంటిక్ మ్యూజికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించింది. ఈ క్రమంలో ఈ మూవీని తెలుగులో ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో డబ్ చేసి ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ విడుదల చేశారు. సెప్టెంబర్ 22న తెలుగు వెర్షన్ థియేటర్లలో విడుదలైంది. అయితే తెలుగులో ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో థియేటర్లలో విడుదలైన వారం రోజుల గ్యాప్‌లోనే ‘సప్త సాగరాలు దాటి’ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు మేకర్స్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో ‘సప్త సాగరాలు దాటి’ శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకొచ్చింది. కాగా హేమంత్ ఎమ్ రావు దర్శకత్వం వహించిన ‘సప్త సాగరదాచే ఎల్లో’ రెండు భాగాలుగా రూపొందింది. తొలిభాగం సెప్టెంబర్ 1న థియేటర్లలోకి రాగా.. రెండో భాగం అక్టోబర్ 20న విడుదల కానుంది. గుండు శెట్టి ఈ సినిమాకు సహ రచయితగా వ్యవహరించగా.. అద్వైత గురుమూర్తి ఛాయాగ్రహణం అందించారు. చరణ్ రాజ్ అందించిన మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ అయింది. ఇక ఈ సినిమాను హీరో రక్షిత్ శెట్టి తన స్వంత బ్యానర్‌పై నిర్మించడం విశేషం. కాగా అక్టోబర్ 27న ఈ సినిమా రెండవ భాగం రాబోతోంది.
‘సప్త సాగరాలు దాటి’ కథ ఏంటంటే?
మధ్య తరగతికి చెందిన ఇద్దరు యువతీ, యువకుల కథే ఇది. కథానాయకుడు మను (రక్షిత్ శెట్టి) ఓ పెద్ద బిజినెస్‌మెన్ దగ్గర కారు డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. విలేజ్ నుంచి పట్నానికి వచ్చిన ప్రియ(రుక్మిణి వసంత్) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ప్రియ కూడా మనుని ఇష్టపడుతుంది. ఈ క్రమంలో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. కాగా ప్రియకి సముద్రం అంటే చాలా చాలా ఇష్టం. దీంతో పెళ్లి చేసుకుని బీచ్ పక్కన ఒక అందమైన ఇల్లు కట్టుకుని హ్యాపీగా జీవించాలని అనుకుంటారు. అయితే దీనికోసం చేయని నేరాన్ని తనపై వేసుకుంటాడు మను.
ఈ అనాలోచిత నిర్ణయం వారి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మను జైలుకి వెళ్లాల్సి వస్తుంది. అయితే మను జైలులో ఎంతకాలం ఉంటాడు? జైలులో అతను ఎదుర్కొన్న పరిస్థితులేంటి? మను కోసం తపించే ప్రియ అతన్ని విడిపించడానికి ఏం చేసింది? అసలు మను జైలు నుంచి విదుడవుతాడా? లేదా? అనే అంశాలను దర్శకుడు హేమంత్ ఎమ్ రావు ఈ సినిమాలో చాలా ఎమోషనల్‌గా చూపించాడు. ఇవన్నీ తెలుసుకోవాలంటే.. అమెజాన్ ప్రైమ్ లో సినిమాను చూడాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: