ముకుంద సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన మెగా హీరో వరుణ్ తేజ్. మొదటి సినిమా అంతలా విజయం సాధింకపోయినా ఆ తరువాత ఫిదా సినిమాతో మాత్రం మంచి హిట్ ను కొట్టి ఆ తరువాత తొలిప్రేమ, గద్దలకొండ గణేష్, ఎఫ్ 2 ఇలా వరుస విజయాలు అందుకొని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. అయితే ఈమధ్యకాలంలో సరైన హిట్ ను అందుకోలేకపోయాడు వరుణ్. గని రీసెంట్ గా రిలీజ్ అయిన గాండీవధారి అర్జున కూడా పరాజయం సొంతం చేసుకున్నాయి. దీంతో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం తన నుండి రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా ఆపరేషన్ వేలంటైన్. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకునే పనిలో ఉంది. అయితే ఈసినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రం ఓ రేంజ్ లోజరుగతుంది. ఈసినిమా డిజిటల్ రైట్స్ భారీ స్థాయిలో అమ్ముడు పోయాయి. కేవలం డిజిటల్ రైట్స్ మాత్రమే 50 కోట్లకు అమ్ముడు పోయినట్టు చిత్రయూనిట్ తెలిపింది. మరి ఈ రేంజ్ లో అమ్ముడు పోయాయంటే గొప్ప విషయమనే చెప్పాలి.
The anticipation for MegaPrince @IAmVarunTej’ #OperationValentine is sky-high among the trade circles!
Digital rights of the film are sold for a Massive 50cr in all languages, All-time Highest for #VarunTej🔥
The film is slated to release on December 8th,2023 in Telugu & Hindi. pic.twitter.com/b7ud8SkFWz
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) September 28, 2023
కాగా ఈసినిమాలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రాడార్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ రాసిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సందీప్ ముద్ద భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈసినిమాను డిసెంబర్ 8వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: