మొత్తానికి బుల్లి తెర ప్రేక్షకులు ఎంతగానే ఎదురుచూస్తున్న ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ మొదలైపోయింది. ఇక ఉల్టా పల్టా అంటూ కాస్త వెరైటీగా వచ్చిన ఈసీజన్ లో నిజంగానే మొదటి నుండీ బిగ్ బాస్ ట్విస్ట్ లు ఇస్తున్నాడు. మరోవైపు ప్రస్తుతానికి హౌస్ లోకి వచ్చింది 14 మంది కంటెస్టెంట్ లు మాత్రమే అయినా ఎవరికి వారు తమ మార్క్ ను చూపించేందుకు తెగ తాపత్రయపడుతున్నారు. ముఖ్యంగా రతిక అయితే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుండి ఏదో ఒక రకంగా కంటెంట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ తో రతిక ట్రాక్ కు ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. అయితే వీరిద్దరి కాంబినేషన్ నచ్చని వాళ్లు కూడా ఉన్నారనుకోండి. కానీ ఇప్పుడు ఇద్దరికీ విభేదాలు వచ్చి మాట్లాడుకోని పరిస్థితిలో ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఫస్ట్ వీక్ మంచి పాజిటివ్ తో టాప్ లో ఉన్న రతికకు ఈవీక్ కాస్త నెగిటివ్ అవుతుందని అంటున్నారు బిగ్ బాస్ లవర్స్. దానికి కారణం పల్లవి ప్రశాంత్ ను తప్పుబట్టి నామినేట్ చేయడం ఒక కారణమైతే మరొకటి తన టీమ్ మెంబర్స్ పైనే అభ్యంతరకరమైన కామెంట్స్ చేయడం అంటున్నారు. నిన్న జరిగిన టాస్క్ లో భాగంగా వీళ్లందరూ జోకర్స్ లా ఉన్నారు.. టీమ్ లో ఉండాలంటేనే చెండాలంగా ఉంది.. అందరూ బఫూన్స్ అంటూ తిట్టేసింది. అయితే రతిక అలా కామెంట్స్ చేయడం సరికాదు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి రతిక కామెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటో మీ ఓటు ద్వారా తెలియచేయండి. ఓటు ద్వారా తెలియచేయండి.
[totalpoll id=”102562″]
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: