మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన సినిమా భోళాశంకర్. తమిళ్ లో అజిత్ హీరోగా వచ్చిన వేదాళం సినిమాకు ఈసినిమా రీమేక్ అన్నసంగతి తెలిసిందే కదా. ఆగష్ట్ 11వవ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా ఇక్కడ మాత్రం ఈసినిమా అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. ఇక ఇప్పుడు ఈసినిమా ఓటీటీలోకి వచ్చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. దీనిలో భాగంగానే నేడు ఈసినిమా ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆడియన్స్ ముందుకి వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటించగా.. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించింది. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఇతర పాత్రల్లో నటించారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించగా.. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: