స్కంద యూఎస్‌లో ఎన్ని లొకేషన్లలో రిలీజ్ అవుతుందంటే?

Skanda Will Be Releasing in Over 350 Locations Across USA

టాలీవుడ్‌లో మాస్ మసాలా యాక్షన్‌ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌ డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఆయన తన సినిమాలలో హీరోలను ఊర మాస్ క్యారెక్టర్స్ లో చూపిస్తుంటారు. అలాగే ఎనర్జిటిక్ క్యారక్టర్లకు పెట్టింది పేరు రామ్‌ పోతినేని. వీరిద్దరి కలయికలో వస్తోన్న చిత్రం ‘స్కంద’. ఈ సినిమాలో రామ్ పోతినేని సరసన టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా.. సయీ మంజ్రేకర్‌ మరో కీలక పాత్ర పోషిస్తోంది. అఖండ సినిమాతో అద్భుత విజయం అందుకున్న బోయపాటి శ్రీను తర్వాత వస్తోన్న చిత్రం కావడం, అలాగే స్కంద నుంచి లాంఛ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్‌, సాంగ్స్ కు విశేష స్పందన రావడంతో ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా సినిమాకు సంబంధించి మూవీ టీమ్ ఒక కీలక అప్‌డేట్ ఇచ్చింది. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్‌ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుండగా.. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో యూఎస్‌లో స్కంద మేనియా స్టార్ట్ అయింది. యూఎస్‌ఏలో మొత్తంగా స్కంద 350కి పైగా లొకేషన్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ మేరకు మేకర్స్ అధికారికంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తాజా అప్‌డేట్‌పై యూఎస్‌ లోని మూవీ లవర్స్‌ హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయమని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే, ఇటీవలే విడుదల చేసిన మూవీ ట్రైలర్‌కు అనూహ్య రీతిలో రెస్పాన్స్ వస్తోంది. మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో టాప్‌ ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటివరకు స్కంద ట్రైలర్‌ 50 మిలియన్లకు పైగా వ్యూస్‌తో యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. అలాగే ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన ‘నీ చుట్టూ చుట్టూ’, ‘గండరబాయ్’, ‘డుమ్మారే డుమ్మారే’ పాటలు వీక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. ముఖ్యంగా సాంగ్స్ లో రామ్‌, శ్రీలీల డాన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉందని సినీ ప్రియులు కామెంట్స్ చేస్తున్నారు.

అవుట్‌ ఆండ్‌ అవుట్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని ప‌వ‌న్ కుమార్ స‌మ‌ర్పణలో శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్స్ ప‌తాకంపై శ్రీనివాస చిట్టూరి అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నిజానికి ఈ సినిమా సెప్టెంబర్‌ 15నే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘సలార్’ సినిమా సెప్టెంబర్‌ 28న విడుదల కావాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో వాయిదా పడింది. దీంతో స్కంద టీమ్ అదే రోజున మూవీ రిలీజ్ చేయడానికి నిశ్చయించుకున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + seven =