పఠాన్ సినిమాతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఇప్పుడు మరో సెన్సేషన్ జవాన్ తో వచ్చేస్తున్నాడు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా జవాన్ సినిమా వస్తుంది. ఈకాంబినేషన్ వల్ల సినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక ఈసినిమా నుండి వస్తున్న అప్ డేట్లు అన్నీ సినిమాపై అంచనాలను ఇంకా పెంచేేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో అతిధి పాత్రలపై గత కొద్దిరోజులుగా పలు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. దళపతి విజయ్ ఈసినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు జోరుగా వస్తున్నాయి. అయితే తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ అట్లీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అట్లీ ఈ వార్తలపై స్పందిస్తూ.. విజయ్ అన్న క్యామియో ఈసినిమాలో లేదని.. అవకాశం వస్తే ఫ్యూచర్ లో మాత్రం వీరిద్దరి కాంబినేషన్ లో ఒక మల్టీస్టారర్ సినిమా చేస్తానని తెలిపాడు. అంతేకాదు మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ కూడా ఇచ్చాడు. తాను ఈసినిమాలో ఒక చిన్న అతిథి పాత్రలో కొన్ని నిమిషాలు మాత్రం కనిపిస్తానని తెలిపాడు.
కాగా ఈసినిమాలో షారుక్ రెండు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఒకటి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా.. మరొకటి గ్యాంగ్‌స్టర్‌గా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. ఈసినిమాలోనయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. విజయ్ సేతుపతి, ప్రియమణి, యోగి బాబు, సునీల్ గ్రోవర్ కూడా పలు పాత్రల్లో నటిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గౌరీఖాన్ నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: