టాలీవుడ్ క్లాస్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో సుధాకర్ కోమాకుల. ఆయన నటించిన లేటెస్ట్ ఫన్ ఎంటర్‌టైనర్ ‘నారాయణ అండ్ కో’. చిన్న పాపిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జూన్ 30న ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా ఓటిటిలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ‘నారాయణ అండ్ కో’ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఓటిటిలో మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ కావడంతో ఎక్కువ మందికి ఇది కనెక్ట్ అవుతోంది. సో.. థియేటర్‌లో ఈ చిత్రాన్ని మిస్ అయిన ప్రేక్షకులు ఎంచక్కా ఇప్పుడు అమెజాన్‌లో చూసేయండి. శ్రీనివాస్ గొర్రిపూడి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రానికి ముగ్గురు సంగీత దర్శకులు సురేశ్ బొబ్బిలి, డాక్టర్ జోస్యభట్ల, నాగవంశి మ్యూజిక్ అందించడం విశేషం.
ఇక ముఖ్యంగా ఈ సినిమా నారాయణ అనే ఒక మధ్య తరగతి ఫ్యామిలీ పర్సన్ మరియు ఆయన కుటుంబ సభ్యుల చుట్టూ తిరిగే కథతో ఫన్ ఎలిమెంట్స్‌తో మోస్ట్ ఎంటర్‌టైనింగ్ గా సాగుతుంది. ఆ కుటుంబాన్ని లీడ్ చేసే ఇంటి పెద్ద నారాయణ పాత్రలో నటుడు, దర్శకుడు దేవీ ప్రసాద్ తనదైన శైలిలో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయగా.. అతని భార్య పాత్రలో సీనియర్ నటి ఆమని నటించింది. ఇక నారాయణ కొడుకు పాత్రలో కథానాయకుడు సుధాకర్ కోమాకుల అద్భుతంగా నటించాడు. అలాగే ఈ మూవీలో పూజా కిరణ్, యామిని, జయ్‌కృష్ణ, సప్తగిరి, అలీరెజా, శివ, రాగిణి, అనంత్ తదితర నటీ,నటులు కీలక పాత్రలు పోషించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: