ఉస్తాద్ బ్యాక్ టు యాక్షన్

pawan kalyan joins in sets of ustaad bhagat singh for new schedule

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈసినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గబ్బర్ సింగ్ కాంబినేషన్ కాబట్టి సినిమాను ప్రకటించినప్పటి నుండే అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈసినిమాను ప్రకటించిన తరువాత సెట్స్ పైకే చాలా లేట్ గా వెళ్లింది. ఈమధ్యే షూటింగ్ ను స్టార్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇకఈసినిమా ఇప్పటికే ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక ఆ తరువాత పవన్ మళ్లీ తన వారాహి యాత్రతో ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో షూటింగ్ కు మళ్లీ లాంగ్ గ్యాప్ వచ్చింది. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక స్పషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇదిలా ఉండగా తాజాగా మరో సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. నేటి నుండి భారీ షెడ్యూల్ కోసం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొంటున్నారని.. ఈ షెడ్యూల్ లో కొన్ని పవర్ ప్యాక్ట్ సీన్లను చిత్రీకరించనున్నామని తెలిపారు.

ఇదిలా ఉండగా ఈసినిమా నుండి రీసెంట్ గానే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా పవర్ స్టార్ స్వాగ్, డైలాగ్, లుక్ కు ట్రెమెండెస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈసినిమా కూడా సంచలనాలు సృష్టించే అవకాశం ఉందని అంటున్నారు. కాగా ఈసినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఈసినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.