విలక్షణ నటుడు కమల్ కూడా ఒక సినిమా తరువాత ఒక చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది విక్రమ్ తో బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న కమల్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో ఈసినిమా షూటింగ్ పూర్తయిపోతుంది. ఇదిలా ఉండగా మణిరత్నంతో కూడా కమల్ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. KH 234అనే వర్కింగ్ టైటిల్ తో ఈసినిమా రానుంది. వీరిద్దరి కాంబినేషన్ లో 1987లో నాయగన్ సినిమా వచ్చింది. ఆసినిమా సంచలన విజయం దక్కించుకుంది. ఇక ఇన్నేళ్ల తరువాత మరోసారి కలిసి పనిచేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా నటించే హీరోయిన్ పై ఇంట్రెస్టింగ్ వార్త తెరపైకి వచ్చింది. ఈసినిమాలో కమల్ కు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటించనున్నట్టు తెలుస్తుంది. కమల్ తో నయన్ కు ఇది మొదటి సినిమా. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం క్లారిటీ వచ్చేంత వరకూ ఆగాల్సిందే. కాగా రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్ పై ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్ పై సంయుక్తంగా కమల్, ఆర్ మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్ నిర్మిస్తున్నారు. ఈసినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.
ఇక మణిరత్నం ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు.
రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా మొదటి భాగం పొన్నియన్ సెల్వన్1 గత ఏడాది విడుదలయి మంచి విజయం అందుకుంది. సెకండ్ పార్ట్ పొన్నియన్ సెల్వన్ 2 ఏప్రిల్ 28వ తేదీన రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీ కి కమల్ హాసన్ వాయిస్ ఓవర్ ను కూడా ఇచ్చారు. మరి ఈసినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: