తమిళ్ లో ఉన్న టాలెంటెడ్ నటుల్లో శివ కార్తికేయన్ కూడా ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చాలా తక్కువ కాలంలోనే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. తన సినిమాలను తమిళ్ లో రిలీజ్ చేస్తూనే తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటాడు. అందుకే తెలుగులో కూడా శివ కార్తికేయన్ కు మంచి క్రేజ్ ఉంది. ఇక ఈ ఏడాది ఇప్పటికే మహా వీరుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివకార్తికేయన్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో బిజీగా అయిపోయాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆర్ రవికుమార్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ హీరోగా వస్తున్న సినిమా అయలాన్. సైన్స్ ఫిక్షన్ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా జరుగుతుంది. ఇక ఇదిలా ఉండగా.. తాజాగా ఈసినిమా రిలీజ్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. నిజానికి ఈసినిమాను ఈఏడాదే దీపావళికి రిలీజ్ చేయాలని అనుకున్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ కాస్త ఎక్కువ టైమ్ తీసుకుంటుండంతో సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి దిగనున్నట్టు వార్తలు తెరపైకి వచ్చాయి. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
కాగా ఈసినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.కెజెఆర్ స్టూడియోస్ బ్యానర్ పై పాన్ ఇండియా స్థాయిలో ఈసినిమాను నిర్మిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: