సుధీర్‌ బాబు మామా మశ్చీంద్ర రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

Sudheer Babu's Mama Mascheendra Release Date Fixed

టాలీవుడ్‌ హీరో సుధీర్‌ బాబు తాను చేసే ప్రతి చిత్రంలో ఎదో ఒక కొత్తదనం చూపించడానికి ప్రయత్నం చేస్తుంటారు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రయోగాలు చేయడానికి ముందుకొస్తుంటారు. ఈ క్రమంలో ఆయన తాజాగా నటిస్తోన్న చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. అయితే ముందే చెప్పుకున్నట్లు ఈ మూవీలో సుధీర్‌ బాబు మరో సరికొత్త ప్రయోగానికి తెరతీసాడు. డిఫరెంట్‌ ఏజ్‌ గ్రూప్స్ ఉండే మూడు విభిన్న గెటప్స్‌లో ఆయన కనిపించనున్నాడు. ఓల్డ్ డాన్‌ పాత్రలో (పరశురాం), ఊబకాయం కలిగిన వ్యక్తిలా (దుర్గ) మరియు స్టైలిష్ డీజేగా సుధీర్‌ బాబు నటిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా తాజాగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ‘మామా మశ్చీంద్ర’ రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీని అక్టోబర్ 6న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఇక ఇప్పటికే మూవీకి సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ సినిమాపై అంచనాలను పెంచగా.. ‘గాలుల్లోనా’ అనే ఫస్ట్ సింగిల్ సాంగ్ మ్యూజిక్‌ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. వీటితో పాటు తాజాగా ఈ మూడు పాత్రలకు సంబంధించి లుక్‌ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

కాగా ‘మామా మశ్చీంద్ర’ చిత్రంలో ఈషా రెబ్బా, మృణాళిని రవి ఫీ మేల్ లీడ్‌ రోల్స్‌ లో నటిస్తుండగా.. హర్షవర్ధన్‌, అలీ రెజా, రాజీవ్‌ కనకాల, హరితేజ, అజయ్‌, మిర్చి కిరణ్‌ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, హిందీ బైలింగ్యువల్ సినిమాగా రూపొందిన ఈ చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై సునీల్‌ నారంగ్‌, సృష్టి సమర్పిస్తున్నారు. చేతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నాడు. సుధీర్‌ బాబు త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రం విడుదల తేదీని లాక్ చేయడంతో మేకర్స్ ప్రచార కార్యక్రమాలను దూకుడుగా చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − two =