రూల్స్ రంజన్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

rules ranjan movie trailer release date fixed

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం వరుస సినిమాతో దూసుకుపోతున్నాడు. సినిమా హిట్లతో సంబంధం లేకుండా అవకాశాలను అందుకుంటూ వెళుతున్నాడు. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తూ బిజీగా కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే వినరో భాగ్యము విష్ణుకథ, మీటర్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ప్రస్తుతం కిరణ్ నుండి రాబోతున్న సినిమా మీటర్. ఈసినిమాకు ఏఎంరత్నం తనయుడు రత్నం కృష్ణం దర్శకత్వం వహించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను ఇప్పటికే మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి రిలీజ్ అయిన సమ్మోహనుడా సాంగ్ ఏ రేంజ్ లో రెస్పాన్స్ తెచ్చుకుందో చూశాం. ఇంకా టీజర్ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు మేకర్స్. ఈమేరకు ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. సెప్టెంబర్ 8వతేదీనఉదయం 11 గంటల 22 నిమిషాలకు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటిచారు మేకర్స్.

కాగా ఈసినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. హైపర్ ఆది, వైవా హర్ష, సుదర్శన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దివ్యంగ్ లావానియా, మురళీ కృష్ణ వేమూరి ఈసినిమాను నిర్మించారు. సెప్టెంబర్ 28వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 1 =