టాలీవుడ్‌లోని సెన్సిబుల్ డైరెక్టర్లలో శివ నిర్వాణ ఒకరు. లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ను సరికొత్తగా తెరపై ఆవిష్కరించడంలో ఆయనది అందె వేసిన చేయి. శివ నిర్వాణ ఇంతకుముందు తెరకెక్కించిన ‘నిన్ను కోరి’, ‘మజిలీ’, ‘టక్ జగదీశ్’ సినిమాలు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ అయ్యాయి. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఖుషి’. విజయ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో అందమైన ప్రేమ కథగా రూపొందుతోన్న ఈ సినిమాను సెప్టెంబర్ 1న పాన్ ఇండియా స్థాయిలో దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ‘ఖుషి’కి సంబంధించి మీడియాతో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు డైరెక్టర్ శివ నిర్వాణ.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా శివ నిర్వాణ మాట్లాడుతూ.. ‘నిన్ను కోరి, మజిలీ, టక్ జగదీశ్ తర్వాత ఔట్ ఆఫ్ ది బాక్స్ మూవీ చేయాలని అనుకున్నా. అలా ‘ఖుషి’ జర్నీ మొదలైంది. ఇవాళ్టి కాంటెంపరరీ సొసైటీలో ఉన్న ఒక ఇష్యూను విజయ్, సమంత లాంటి పాపులర్ స్టార్స్ ద్వారా అడ్రస్ చేయిస్తే బాగుంటుందని నమ్మాను. నేను గతంలో తెరకెక్కించిన నిన్ను కోరి, మజిలీలో ఫెయిల్యూర్ లవ్ స్టోరీస్ చూపించాను. కానీ ఈసారి ఒక ఎంటర్ టైనింగ్, ఎనర్జిటిక్, సరదాగా ఉండే ప్రేమ కథను రూపొందించాలని అనుకున్నాను. నేను వ్యక్తిగతంగా సరదాగా ఉండే పర్సన్ ని. ఈ సినిమాకు సరదా అని, మరికొన్ని టైటిల్స్ అనుకున్నాను. ప్రేమ కథను ఎంత కొత్తగా చెప్పాలి అనే ఆలోచన నుంచి పుట్టిందే కాశ్మీర్ బ్యాక్ డ్రాప్’ అని తెలిపారు.
సమంతను ఎందుకు తీసుకున్నామంటే..?
‘విజయ్ దేవరకొండ, సమంతకున్న పాన్ ఇండియా ఇమేజ్ కు సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీసుకెళ్లాలి అనుకున్నప్పుడు ఐదు భాషలకు కలిపి ఒకే టైటిల్ ఉంటే బాగుంటుంది అనిపించింది. అలా ‘ఖుషి’ టైటిల్ ఫిక్స్ చేశాం. ఈ సినిమా విజయ్ తో స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత సమంత లాంటి ఫర్ ఫార్మింగ్ హీరోయిన్ ఉంటే సినిమా మరింత స్ట్రాంగ్ అవుతుందని చెప్పి ఆమెను అడిగాం. ‘ఖుషి’ లో వింటేజ్ సమంతను చూస్తారు. ఆమె ఫ్యామిలీ మ్యాన్ వంటి డిఫరెంట్ జానర్స్ చేసింది. ఇప్పుడు లవ్ స్టోరిలో సమంతను చూడటం మంచి ఫీల్ కలిగిస్తుంది. ‘ఖుషి’ సినిమా కథకు సమంత రియల్ లైఫ్ కు ఎలాంటి పోలికలు, సంబంధం లేదు. నేను మూడేళ్ల క్రితం రాసుకున్న కథ ఇది. ఆమెతో మజిలీ సినిమా చేశాను కాబట్టి బాగా నటించగలదు అని ఇందులోకి తీసుకున్నాం’ అని శివ అన్నారు.
ఇంకా శివ మాట్లాడుతూ.. నేను రాసిన కథలో ఆమె తన క్యారెక్టర్ ప్లే చేసింది అంతే. మరో హీరోయిన్ ఈ సినిమాలో నటిస్తే ఇలాంటి ప్రశ్నలకు అవకాశం ఉండదు. సమంత షూటింగ్ కోసం ఎంతో కోపరేట్ చేస్తుంది. చాలా డెడికేటెడ్ హీరోయిన్. అలాంటి హీరోయిన్ కు ఒక హెల్త్ ప్రాబ్లమ్ వస్తే మేమంతా సపోర్ట్ చేయకుంటే ఎలా. ఆమె ట్రీట్ మెంట్ మధ్యలో వస్తా అని చెప్పేది, కానీ మధ్యలో గ్యాప్ ఇస్తూ షెడ్యూల్స్ చేయడం ఇబ్బందిగా ఉండి.. పూర్తిగా నయమైన తర్వాతే రమ్మని చెప్పాం. ఇక విజయ్ లో మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. పెళ్లి చూపులు, గీత గోవిందంలో ఒకలాంటి కామెడీ టైమింగ్ చూశారు. కానీ ఇందులో స్టైలిష్ కామెడీ చేశాడు. అమ్మాయిలకు, ఫ్యామిలీ ఆడియెన్స్ కు విజయ్ క్యారెక్టర్ బాగా నచ్చుతుంది. అందరూ ఆయన క్యారెక్టర్ ను ఓన్ చేసుకుంటారు’ అని చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: