పుష్పలో నటనకు గాను జాతీయ అవార్డు గెలుచుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అందరితో ప్రశంసలు అందుకుంటున్నాడు.తెలుగు సినిమా చరిత్రలో మొదటి సారి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు కైవసం చేసుకొని చరిత్ర సృష్టించాడు.ఇక ఇప్పుడు బన్నీకి తాజాగా మరో అరుదైన గౌరవం లభించింది.సోషల్ మీడియా దిగ్గజం ఇంస్టాగ్రామ్ టీం నిన్న అల్లు అర్జున్ ను కలిసి ఆయనఫై స్పెషల్ వీడియో ను షూట్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
ఈ వీడియోలో అల్లు అర్జున్ తన డే ఎలా స్టార్ అవుతుంది తన ఫ్యామిలీ అలాగే ఫ్యాన్స్ గురించి చెప్పి ఇంస్టాగ్రామ్ టీంను పుష్ప 2 షూటింగ్ లొకేషన్ కూడా తీసుకెళ్లాడు.అక్కడ అల్లు అర్జున్ యాక్టింగ్ చేస్తుండగా ఓ సీన్ ను ఇంస్టాగ్రామ్ వాళ్లు షూట్ చేశారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో ట్రెండ్ అవుతుంది.ఇక ఇదిలావుంటే పుష్ప ది రూల్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది.అల్లు అర్జున్ ఫై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.ఇక ఈసినిమాను వచ్చే ఏడాది మార్చి 22 న విడుదలచేయనున్నట్లు ఇటీవల నిర్మాతలు తెలియజేశారు.త్వరలోనే దీని గురించి అఫీషియల్ అప్డేట్ ఇవ్వనున్నారు.
బ్లాక్ బాస్టర్ పుష్పకు సీక్వెల్ గా వస్తున్న ఈసినిమాఫై అంచనాలు తారాస్థాయిలో వున్నాయి.ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: