నటసింహ నందమూరి బాలకృష్ణ టాలీవుడ్ పరిశ్రమలో 49 గ్లోరియస్ ఇయర్స్ పూర్తి చేసుకున్నారు. నటుడిగా నేటితో 50వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. బాలకృష్ణ తన పుట్టిన రోజైన జూన్ 10కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో.. ఆగస్టు 30ని కూడా అంతే గొప్పగా చూస్తారు. ఎందుకంటే..? ‘తాతమ్మకల’ అనే సినిమాతో బాలకృష్ణ తొలిసారిగా తన 14వ ఏట సినిమా ఇండస్ట్రీలో అరంగేట్రం చేశారు. అప్పటినుంచి ఇప్పటివరకూ బాలకృష్ణ దాదాపు ఐదు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను తనదైన నటనతో అలరిస్తున్నారు. బాలకృష్ణ హీరోగా.. కథానాయకుడు, ముద్దుల మావయ్య, నారీ నారీ నడుమ మురారి, ఆదిత్య 369, భైరవద్వీపం, రౌడీ ఇనస్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహా, లెజెండ్, అఖండ వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో 108వ సినిమాగా ‘భగవంత్ కేసరి’ చేస్తున్నారు. ఇక బాలకృష్ణను ఆయన అభిమానులు ముద్దుగా ‘బాలయ్య’ అని పిలుచుకోవడం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాలయ్య తొలిసినిమా విశేషాలు..
కాగా తాతమ్మకల సినిమాకు బాలకృష్ణ తండ్రి, నాటి అగ్ర హీరో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) దర్శకత్వం వహించడం విశేషం. అలాగే అన్న హరికృష్ణ, తండ్రి ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం మరో విశేషం. 1974, ఆగస్టు 30న విడుదలైన ఈ చిత్రంలో ఆనాటి పల్లెటూరి జీవన విధానానికి, పట్టణం పొకడకి మధ్య గల తేడాను స్పష్టంగా చూపారు ఎన్టీఆర్. ఇక తాతమ్మ కల సినిమాలో ప్రముఖ సీనియర్ నటీమణి భానుమతి టైటిల్ రోల్ వేయగా.. ఆమె మనవడిగా బాలయ్య నటించాడు. అయితే ఇదే కాంబినేషన్ ఆ తర్వాత ‘మంగమ్మగారి మనవడు’ మూవీలో రిపీట్ అయ్యి బ్లాక్ బస్టర్ కొట్టింది. అయితే అప్పట్లో ఒకే చిత్రం రెండుసార్లు విడుదలవ్వడం టాలీవుడ్ హిస్టరీలో అదే తొలిసారి. మొదటిసారి ‘బ్లాక్ అండ్ వైట్’లో.. రెండోసారి కలర్‌లో విడుదలైంది.
కాగా ఈ సినిమా నిర్మాణం సమయంలో నాటి కేంద్ర ప్రభుత్వం కుటుంబ నియంత్రణ ప్రచారం మొదలుపెట్టింది. కానీ, దీనిని వ్యతిరేకించిన ఎన్టీఆర్.. ఈ సినిమాలో ఎక్కువమంది సంతానాన్ని కనడంలో తప్పులేదని వాదించారు. అలాగే భూసంస్కరణ విధానంపై కూడా ప్రభుత్వ విధానాలను ఎత్తిచూపారు. దీంతో ఈ చిత్రం వివాదాస్పదంగా మారింది. తత్ఫలితంగా సినిమా ప్రదర్శన నిలిపేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా విడుదలై అప్పటికే 50 రోజులైనా.. చిత్ర ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఎన్టీఆర్ విజ్ఞప్తి మేరకు సినిమాను పరిశీలించిన కేంద్రం.. మళ్లీ విడుదల చేయడానికి అనుమతి ఇచ్చింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: