రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్కంద’. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుస్తోంది. అవుట్ ఆండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాపై సినీ లవర్స్‌తో పాటు ఇండస్ట్రీలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికితోడు ఇటీవలే రిలీజైన మూవీ గ్లింప్స్, సాంగ్స్ కి విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా సాంగ్స్ లో రామ్ పోతినేని, శ్రీలీల డాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని సినీ ప్రియులు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ క్రేజీ మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో చిత్రం ప్రీ రిలీజ్ థండర్ ఈవెంట్ నేడు జరుగనుంది. ఇక ఈవెంట్ లో భాగంగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ ఈవెంట్‌కు నందమూరి బాలకృష్ణ చీఫ్ గెస్ట్‌గా రానుండటం విశేషం. కాగా బాలకృష్ణ, బోయపాటి శ్రీను తమ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్స్ అందించిన విషయం తెలిసిందే. ఇక గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. బాలకృష్ణ చేతుల మీదుగా ట్రైలర్ రిలీజ్ చేయనుండటంతో ‘స్కంద’పై హైప్ భారీగా పెరుగుతుందని మేకర్స్ ఆశిస్తున్నారు. కాగా ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 15న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: