రామ్ చరణ్ ఆర్‌సీ16పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చి బాబు

Director Buchi Babu Shares Interesting Update About RC16 Movie

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా ‘ఉప్పెన’ సినిమా అవార్డు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా డైరెక్టర్‌ బుచ్చి బాబు సానాకు ఇదే తొలిచిత్రం కావడం గమనార్హం. దీంతో మొదటి సినిమాకే జాతీయ అవార్డు అందుకొని బుచ్చి బాబు ప్రస్తుతం టాక్‌ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాడు. ఈ సందర్భంగా బుచ్చి బాబు మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ‘ఉప్పెన’ సినిమాకు అవార్డు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పిన ఆయన తొలి సినిమాతోనే గొప్ప లక్ష్యాన్ని అందుకున్నానని తెలిపారు. ఈ విజయంతో ఒక దర్శకుడిగా తనపై బాధ్యత మరింత పెరిగిందని, ఇకపై తాను చేయబోయే సినిమాల విషయంలో అప్రమత్తంగా ఉంటానని తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఉప్పెన తర్వాత బుచ్చి బాబు మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి రెండో సినిమా ఆర్‌సీ16 చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ పంచుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌ గురించి మాట్లాడుతూ.. ‘నాలుగేళ్లుగా ఆర్‌సీ16 కథను రెడీ చేసేందుకు శ్రమించాను. ఇది నాకు అత్యంత ఇష్టమైన సబ్జెక్ట్‌. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఉంటుంది. రామ్ చరణ్‌కి కూడా ఈ సబ్జెక్ట్ బాగా నచ్చింది. ఈ సినిమాలో చరణ్‌ బాడీ లాంగ్వేజ్‌ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా తప్పకుండా బ్లాక్‌ బస్టర్‌ హిట్టవుతుంది’ అని పేర్కొన్నారు. బుచ్చి బాబు తాజా కామెంట్స్‌తో రామ్ చరణ్‌ ఆర్‌సీ16 సెట్స్‌కి కూడా వెళ్లకముందే అంచనాలు పెరుగుతున్నాయి.

రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న క్రమంలో ‘ఆర్‌సీ16’ను అంతే స్థాయిలో తీయడానికి బుచ్చి బాబు సన్నాహాలు చేస్తున్నారు. కిలారు వెంకట సతీశ్‌ నిర్మించనున్న ఈ చిత్రాన్ని సుకుమార్‌-మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా తెరకెక్కించనున్నాయి. కాగా ‘ఆర్‌సీ 16’కి ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందించబోతున్నారు. కాగా బుచ్చిబాబు ఇప్పటికే సుకుమార్ డైరెక్షన్‌లో రామ్ చరణ్‌ నటించిన బ్లాక్ బస్టర్ రంగస్థలం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్‌, తమిళ అగ్ర దర్శకుడు శంకర్‌ దర్శకత్వంలో ‘గేమ్‌ ఛేంజర్’ సినిమా చేస్తున్నారు. ఇందులో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − 10 =