గాడ్ ఆఫ్ మాసెస్ గా పేరొందిన టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డెడ్లీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘భగవంత్ కేసరి’. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్దిలు ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ తో చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగాయి. నందమూరి ఫ్యాన్స్ నుంచే కాకుండా ఇండస్ట్రీ వర్గాల నుంచి కూడా దీనిపై టెర్రిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. అందులో ముఖ్యంగా బాలకృష్ణ తెలంగాణ యాసలో పలికిన డైలాగులు అభిమానులను బాగా అలరించాయి. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ‘భగవంత్ కేసరి’ మ్యూజికల్ ప్రమోషన్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి. మూవీ మ్యూజికల్ హంగామాలో భాగంగా సెప్టెంబర్ 1న ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ గణేష్ ఏంథమ్ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు. ఇక బాలకృష్ణ గత చిత్రం ‘అఖండ’కు ఎక్స్ టార్డినరి మ్యూజిక్ అందించిన ఎస్ఎస్ థమన్ భగవంత్ కేసరి కోసం సెన్సేషనల్ ఆల్బమ్‌ను అందించారు. టైటిల్, పోస్టర్ సూచించినట్లుగా ఇది మాస్ నంబర్ అవుతుంది. పోస్టర్‌లో మునుపెన్నడూ లేని మాస్ అవతార్‌లో డ్రమ్స్ కొడుతూ కనిపించారు బాలకృష్ణ. పాటలోని ఎనర్జీ ఆయన ముఖంలోనే కనిపిస్తుంది. పోస్టర్‌లో డ్యాన్సర్‌లను కూడా మనం చూడవచ్చు.
కాగా బాలకృష్ణ అంతకుముందు చేసిన ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అలాగే అనిల్ రావిపూడి కూడా వరుస హిట్లతో జోరు మీదున్నాడు. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం కావడంతో ‘భగవంత్ కేసరి’పై నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతుండటం విశేషం. ప్రతినాయకుడి పాత్రలో ఆయన విలనిజం పండించనున్నారు. ఇక ఈ చిత్రానికి సి రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా.. ఎడిటర్ గా తమ్మిరాజు, ప్రొడక్షన్ డిజైనర్ గా రాజీవ్ పనిచేస్తున్నారు. అలాగే యాక్షన్ పార్ట్‌కి వి వెంకట్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: