బోయపాటి, రామ్ పోతినేని స్కంద ప్రీ రిలీజ్ థండర్ డేట్ ఖరారు

Ram Pothineni Skanda Movie Pre-release Thunder to be Released on August 26

టాలీవుడ్ లోని సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో బోయపాటి శ్రీను ఒకరు. ఆయన తన సినిమాలలో హీరోలను ఊర మాస్ క్యారెక్టర్స్ లో చూపిస్తుంటారు. తాజాగా ఆయన ఉస్తాద్ రామ్ పోతినేనితో కలిసి ‘స్కంద’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్‌ ఇప్పటి నుంచే ప్రమోషన్స్ క్యాంపెయిన్‌ స్టార్ట్ చేశారు. తాజాగా సినిమాకు సంబంధించి మూవీ టీమ్ సాలిడ్ అప్‌డేట్ ఇచ్చింది. ‘స్కంద’ ప్రీ రిలీజ్ థండర్ ఆగస్టు 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లతో ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించడంలో దిట్ట. కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లు చేయడంలో స్పెషలిస్ట్ అయినప్పటికీ తన సినిమాల్లో తగిన వినోదం, ఫ్యామిలీ డ్రామా ఉండేలా చూసుకుంటారు. ఇక రాపో హై-ఆక్టేన్ ఎనర్జీ, ఉబర్ స్టయిల్ కి చిరునామా. బోయపాటి ‘స్కంద’ కోసం ఎనర్జిటిక్ & మాస్ ఉస్తాద్ రామ్ పోతినేనితో చేతులు కలిపారు. దీంతో రామ్ ‘స్కంద’ కోసం అన్ బిలివబుల్ గా మాస్ ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు. రాపో డిఫరెంట్ షేడ్స్‌లో కనిపిస్తున్నారు. పోస్టర్స్ లో అల్ట్రా మాస్‌తో పాటు క్లాస్‌ లుక్స్‌లోనూ అదరగొట్టారు. కండలుతిరిగిన శరీరంతో పవర్ ఫుల్ లుక్ లో ఎక్స్ టార్డినరిగా కనిపించారు. ఈ కాంబో & కంటెంట్ ‘స్కంద’ మాస్, ఫ్యామిలీ ఆడియన్స్ ని సమానంగా అలరిస్తుందని సూచిస్తోంది.

ఇక రిలీజ్ చేసిన పోస్టర్‌లో హీరో రామ్, హీరోయిన్ శ్రీలీల బ్యూటీఫుల్ కెమిస్ట్రీని పంచుకున్నారు. రామ్ పంచెకట్టులో కనిపిస్తే, శ్రీలీల హాఫ్ చీరలో హోమ్లీగా కనిపిస్తుంది. పొలంలో కూర్చుని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అందమైన చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. కాగా ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని మొదటి రెండు పాటలు ఇప్పటికే విడుదలై సంచలన విజయం సాధించాయి. అలాగే ఫస్ట్ థండర్, టైటిల్ గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ క్రమంలో ఆగస్టు 26న విడుదల కానున్న ప్రీ-రిలీజ్ థండర్ సినిమాపై మరింతగా అంచనాలని పెంచనుంది.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, నిర్మాణ విలువలతో భారీ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ డిటాకే కెమెరామెన్ గా పని చేస్తుండగా.. తమ్మిరాజు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. అవుట్‌ ఆండ్‌ అవుట్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక సెప్టెంబర్ 15న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ‘స్కంద’ సినిమా విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + twenty =