69వ జాతీయ సినిమా అవార్డుల్లో సత్తా చాటిన టాలీవుడ్

69th National Film Awards: Tollywood Shines Bright with RRR and Pushpa

సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేషనల్ ఫిలిం అవార్డ్స్‌ను కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం ప్రకటించింది. 2021 సంవత్సరానికి గానూ ఈ చలనచిత్ర పురస్కారాలు అందిస్తున్నట్లు ప్రకటించింది. మొత్తం 28 భాషల్లో 280 సినిమాలు వివిధ విభాగాల్లో పోటీపడగా.. 31 విభాగాల్లో అవార్డులను ప్రకటించారు. ఇక ఈ జాతీయ అవార్డుల్లో టాలీవుడ్ సత్తా చాటింది. మునుపెన్నడూ లేనిస్థాయిలో పలు విభాగాల్లో అనేక అవార్డులను కొల్లగొట్టింది. వివిధ విభాగాల్లో 10 జాతీయ అవార్డులు దక్కించుకుని జాతీయ స్థాయిలో సగర్వంగా నిలిచింది తెలుగు సినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పటికే ఆస్కార్‌ అవార్డ్ గెలుచుకుని చరిత్ర సృష్టించిన రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా నేషనల్‌ అవార్డుల్లోనూ మెరిసింది. వివిధ విభాగాల్లో పోటీపడి 6 పురస్కారాలు దక్కించుకుంది. అలాగే అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికై టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమకు గత 69 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న అవార్డును బన్నీ తనదైన మెస్మరైజింగ్ నటనతో గెలుచుకున్నాడు. 69 ఏళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో ఒక తెలుగు హీరోకు నేషనల్‌ అవార్డు దక్కడం ఇదే తొలిసారి. ఇక ఇదే సినిమాకు ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌గా దేవీ శ్రీ ప్రసాద్‌ నిలిచాడు. ఉత్తమ గేయ రచయిత చంద్రబోస్ ‌(కొండపొలం), ఉత్తమ సినిమాగా ఉప్పెన ఒక్కో అవార్డు అందుకున్నాయి. కాగా బాలీవుడ్ హీరోయిన్స్ అలియా భట్, కృతి సనన్ ఇద్దరూ కలిపి ఈసారి ఉత్తమ నటి అవార్డును అందుకోవడం గమనార్హం.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు అవార్డుల పంట..

  • బెస్ట్ పాపులర్ సినిమా అవార్డ్ – ఆర్‌ఆర్‌ఆర్‌
  • ఉత్తమ స్టంట్‌ కొరియో గ్రాఫర్‌ – కింగ్‌ సాల్మన్‌
  • ఉత్తమ కొరియోగ్రాఫర్‌ – ప్రేమరక్షిత్‌
  • ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌ సూపర్‌ వైజర్‌ – శ్రీనివాస మోహన్‌
  • ఉత్తమ గాయకుడు కాలభైరవ (ఆర్‌ఆర్‌ఆర్‌)
  • ఉత్తమ నేపథ్య సంగీతం కీరవాణి

స్పెషల్ అవార్డ్స్

  • ఉత్తమ ఫీచర్ ఫిల్మ్: రాకెట్రీ
  • ఉత్తమ దర్శకుడు: నిఖిల్ మహాజన్ (గోదావరి)
  • బెస్ట్ పాపులర్ ఫిల్మ్ : RRR
  • నర్గీస్ దత్ అవార్డు అందుకున్న నేషనల్ ఇంటిగ్రేషన్ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌: ది కాశ్మీర్ ఫైల్స్‌

కేంద్రం ప్రకటించిన 69వ జాతీయ సినిమా అవార్డుల విజేతలు వీరే..

  • ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప)
  • ఉత్తమ నటి: అలియా భట్ (గంగూబాయి కతియావాడి) మరియు కృతి సనన్ (మిమీ)
  • ఉత్తమ సహాయ నటుడు: పంకజ్ త్రిపాఠి (మిమీ)
  • ఉత్తమ సహాయ నటి: పల్లవి జోషి (ది కాశ్మీర్ ఫైల్స్)
  • ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్: భవిన్ రాబారి (ఛెలో షో)
  • ఉత్తమ తొలి దర్శకుడిగా ఇందిరా గాంధీ అవార్డు: మెప్పడియాన్, విష్ణు మోహన్
  • సామాజిక సమస్యలపై ఉత్తమ చిత్రం: అనునాద్-ది రెసొనెన్స్
  • పర్యావరణ పరిరక్షణ/పరిరక్షణపై ఉత్తమ చిత్రం: ఆవాసవ్యూహం
  • ఉత్తమ బాలల చిత్రం: గాంధీ అండ్ కో
  • ఉత్తమ స్క్రీన్ ప్లే (ఒరిజినల్): నాయట్టు
  • ఉత్తమ స్క్రీన్ ప్లే (అడాప్టెడ్): గంగూబాయి కతియావాడి
  • ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): దేవి శ్రీ ప్రసాద్, (పుష్ప)
  • ఉత్తమ నేపథ్య గాయని: శ్రేయ ఘోషల్ (ఇరవిన్ నిజాల్)
  • బెస్ట్ లిరిక్స్: చంద్రబోస్, (కొండ పొలం)
  • ఉత్తమ సినిమాటోగ్రఫీ: అవిక్ ముఖోపాధ్యాయ్ (సర్దార్ ఉదమ్)
  • ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్: వీర కపూర్ ఈ, సర్దార్ ఉదమ్
  • ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: డిమిత్రి మలిచ్ మరియు మాన్సీ ధ్రువ్ మెహతా, సర్దార్ ఉదమ్
  • ఉత్తమ ఎడిటింగ్: సంజయ్ లీలా భన్సాలీ, గంగూబాయి కతియావాడి
  • బెస్ట్ మేకప్: ప్రీతీషీల్ సింగ్, గంగూబాయి కతియావాడి
  • స్పెషల్ జ్యూరీ అవార్డు: షేర్షా, విష్ణువర్ధన్

ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు

  • ఉత్తమ హిందీ చిత్రం: సర్దార్ ఉదమ్
  • ఉత్తమ కన్నడ చిత్రం: 777 చార్లీ
  • ఉత్తమ మలయాళ చిత్రం: హోమ్
  • ఉత్తమ గుజరాతీ చిత్రం: ఛెలో షో
  • ఉత్తమ తమిళ చిత్రం: కడైసి వివాహాయి
  • ఉత్తమ తెలుగు చిత్రం: ఉప్పెన
  • ఉత్తమ మరాఠీ చిత్రం: ఏక్దా కాయ్ జలా
  • ఉత్తమ బెంగాలీ చిత్రం: కల్‌కోఖో
  • ఉత్తమ అస్సామీ చిత్రం: అనూర్
  • ఉత్తమ మెయిటీలోన్ చిత్రం – ఐఖోయిగి యమ్
  • ఉత్తమ ఒడియా చిత్రం – ప్రతీక్ష
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + five =