సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన సినిమా జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమా ఫైనల్ గా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ కు ముందే అప్ డేట్లతో సినిమాపై ఆసక్తిని పెంచేశారు. ముఖ్యంగా కావాలయ్యా పాట మాత్రం ఈసినిమాకు కావాల్సినంత బజ్ ను అయితే క్రియేట్ చేసింది. ఇక ఎన్నో అంచనాల మధ్య నేడు రిలీజ్ అయిన ఈసినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో మేకర్స్ అప్పుడే సక్సెస్ సెలబ్రేషన్స్ ను స్టార్ట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సక్సెస్ మీట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. జైలర్ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో మేము, ఏషియన్ మల్టీప్లెక్స్ కలసి విడుదల చేశాం. ప్రేక్షకులు, మీడియా, ఇండస్ట్రీ అన్ని వైపుల నుంచి రజనీకాంత్ గారికి మళ్ళీ బ్లాక్ బస్టర్ పడిందని చెబుతున్నారు. చాలా ఆనందంగా వుంది. థియేటర్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూసి ఆంధ్రాలో చాలా సెంటర్స్ లో మ్యాట్నీ నుంచి అదనంగా థియేటర్స్ యాడ్ అవుతున్నాయి. జైలర్ కి ప్రపంచవ్యాప్తంగా యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, మేము మొదటిసారి కలిసి విడుదల చేయడం, ఇంత పెద్ద విజయం సాధించడం చాలా ఆనందంగా వుంది అన్నారు.
నిర్మాత సునీల్ నారంగ్ మాట్లాడుతూ… ఈ చిత్రం రైట్స్ ని ఇచ్చిన సన్ పిక్చర్స్, కళానిధి మారన్ గారికి ధన్యవాదాలు. జైలర్ చాలా పెద్ద సూపర్ హిట్. సన్ పిక్చర్స్ కి మరోసారి కృతజ్ఞతలు. భవిష్యత్తులో కూడా వారితో కలసి పని చేయాలని కోరుకుంటున్నాం. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు అంటూ తెలిపారు.
కాగా సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ గ్రాండ్ గా విడుదల చేశాయి.
కాగా సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ గ్రాండ్ గా విడుదల చేశాయి. ఈసినిమాలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు.ఇంకా ఈ సినిమాలో తమన్నా, రమ్యకృష్ణ, ప్రియాంక అరుళ్‌మోహన్, యోగిబాబు, వసంత్ రవి, వినాయకన్ తదితరులు కనిపించారు.ఈ మూవీ కి సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: