3500 స్క్రీన్స్ లో కెప్టెన్ మిల్లర్ టీజర్

dhanush captain miller teaser release in 3500 big screens

అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కెప్టెన్ మిల్లర్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకుంటుంది. 1930 – 40ల బ్రిటిష్ కాలం నాటి పీరియాడిక్ మూవీగా పుల్ యాక్షన్ తో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. టీజర్ అయితే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు 24గంటల్లో 23 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకొని రికార్డ్ ను క్రియేట్ చేసుకుంది. ఇక ఇదిలా ఉండగా చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో మరింత బజ్ ను క్రియేట్ చేయడానికి కొత్త కొత్త ఐడియాలతో వస్తున్నారు. దీనిలో భాగంగానే దాదాపు 3500 స్క్రీన్స్ లో ఈసినిమా టీజర్ ను ప్రదర్శించనున్నారు. తమిళ్ తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేష్, కర్ణాటక, కేరళలోని థియేటర్లలో ఈ టీజర్ ను ప్రదర్శించనున్నారు. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ద్వారా అధికారికంగా తెలియచేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. సందీప్ కిషన్, కన్నడ స్టార్ శివరాజ్‌ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై సెంథిల్ త్యాగ‌రాజ‌న్‌, ఆర్జున్ త్యాగ‌రాజ‌న్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీని.. నాగూరన్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈసినిమా డిసెంబర్15వ తేదీన తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =