ముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించి ఆ తరువాత గుంటూరు టాకీస్ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమైన హీరో సిద్దు జొన్నలగొడ్డ. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. అయితే డీజే టిల్లు తో సిద్దు కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆసినిమాతో సూపర్ హిట్ ను అందుకోవడమే కాకుండా సిద్దూ క్రేజ్ కూడా మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం డీజే టిల్లూ సీక్వెల్ తో బిజీగా ఉన్నాడు. టిల్లూ స్క్వేర్ అనే టైటిల్ తో ఈసినిమా రాబోతుంది. అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. రీసెంట్ గానే గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ తో సిద్దూ మరో హిట్ ను సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వెలువడ్డాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. సిద్దూ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈసినిమా రాబోతుంది. అయితే ఈసినిమాను నేడు పూజా కార్యక్రమాలతో గ్రాండ్ లాంచ్ చేశారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా.. దిల్ రాజు కెమెరా స్విచ్చాన్ చేశారు. కాగా ఈసినిమాను ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తున్నారు. హారీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈసినిమాలో నటించే హీరోయిన్ ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియచేయనున్నారు .
#SVCC37 a pooja ceremony
🔗https://t.co/vQSbMSNktJStarring Star Boy #SidduJonnalagadda, Directed by @baskifilmz
Thanks to all the guests who graced the occasion and shared their best wishes to the team pic.twitter.com/TPywpOxEn1
— SVCC (@SVCCofficial) August 10, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























