తండ్రి సూపర్ స్టార్ కృష్ణ వారసత్వంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకొని ప్రస్తుతం స్టార్ హీరోగా సినీ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. నేడు మహేష్ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈనేపథ్యంలో ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా మహేష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తున్నారు. ఫ్యాన్స్ తో పాటు సినీ సెలబ్రిటీలు అందరూ సోషల్ మీడియా వేదికగా ఆయనకు బర్త్ డే విషెస్ ను అందిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియచేశారు. శ్రీ మహేష్ బాబు కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కృష్ణ గారి అడుగుజాడల్లో వెళ్తూ, విభిన్న పాత్రల్లో మెప్పించే అభినయ సామర్థ్యం ఆయన సొంతం. సోదరసమానుడైన శ్రీ మహేష్ బాబు మరిన్ని విజయాలు అందుకోవాలని, సంపూర్ణ ఆనందంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ పోస్ట్ లో పేర్కొన్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజాగా సతీమణి నమ్రత కూడా మహేష్ కు స్వీట్ విషెస్ ను అందించింది. తన ఇన్ స్ట్రా గ్రామ్ వేదికగా మహేష్ తాను ఉన్న ఫొటోను పోస్ట్ చేస్తూ హ్యాపీ బర్త్ డే ఎంబీ.. నువ్వే నువ్వే.. ఈరోజూ నువ్వే.. ప్రతి రోజూ నువ్వే అంటూ పోస్ట్ లో మహేష్ పై తనకు ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు.
View this post on Instagram
కాగా మహేష్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమాను చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. ఇప్పటికే మహేష్ పుట్టిన రోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ తో మాస్ ట్రీట్ ను అందించారు మేకర్స్. ఈసినిమాలో మహేష్ బాబు సరసన మీనాక్షి చౌదరి అలానే శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: