విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఖుషి ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది.రీసెంట్ గా విడుదలైన సాంగ్స్ అన్ని సూపర్ హిట్ కావడంతో సినిమాఫై హైప్ క్రియేట్ చేయగా తాజాగా విడుదలైన ట్రైలర్ అంచనాలకు తగ్గట్లుగా వుంది.విప్లవ్,ఆరాధ్యల ప్రేమ ఆతరువాత వారి వైవాహిక జీవితం చుట్టూ తిరిగే కథతో వస్తుంది ఖుషి.విప్లవ్ పాత్రలో విజయ్ దేవరకొండ,ఆరాధ్య పాత్రలో సమంత నటించారు.వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాలో హైలైట్ కానుంది.ట్రైలర్ లో మాత్రం విజయ్,సమంత ల లుక్ అదిరిపోయింది.విజువల్స్ చాలా బాగున్నాయి.ట్రైలర్ చూస్తుంటే ఈసినిమాతో సాలిడ్ హిట్ కొట్టి విజయ్ మళ్ళీ ట్రాక్ లోకి రావడం ఖాయంగా కనిపిస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈసినిమాలో మురళి శర్మ,రాహుల్ రామకృష్ణ,రోహిణి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.మలయాళ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్లా వాహబ్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో వున్న ఈసినిమా సెప్టెంబర్ 1న తెలుగుతోపాటు హిందీ,తమిళ,కన్నడ,మలయాళ భాషల్లో విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: