మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ వరుసగా హిట్లను అందుకుంటూ కెరీర్ లో మంచి ఫామ్ లో ఉన్నాడు. రిపబ్లిక్, విరూపాక్ష రీసెంట్ గా బ్రో ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకున్నాడు. ఇక సాయి ధరమ్ తేజ్ తన తరువాత సినిమాను సంపత్ నందితో చేయనున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈ ప్రాజెక్ట్ లో సాయి తేజ్ కాస్త గ్యాప్ తీసుకొని జాయిన్ అవుతాడు. ఒక మూడు నెలల నుండి ఆరు నెలల వరకూ ఫిజికల్ ఫిట్ కోసం గ్యాప్ తీసుకుంటానని ఇప్పటికే చెప్పాడు తేజ్. ఈ గ్యాప్ లో ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను కంప్లీట్ చేయనున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మించనున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ గ్యాప్ లో మరో షార్ట్ ఫిలింతో వచ్చేస్తున్నాడు తేజ్. సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ కృష్ణ దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, కలర్స్ స్వాతి ప్రధాన పాత్రలో ఈ ఫిలిం రాబోతుంది. దేశం కోసం ప్రాణాలు విడిచిన అమరవీరులకు నివాళిగా.. అలానే దేశం కోసం పంపించి త్యాగం చేసే భార్యల గురించి తెలియచేస్తూ ఈ ఫిలిం రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే రెండు రోజుల క్రితమే ఈ షార్ట్ ఫిలింలో పాటకు సంబంధించి అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈనేపథ్యంలో తాజాగా ఈపాట టీజర్ ను రిలీజ్ చేశారు. ఇండిపెండెన్స్ డే ఆగష్ట్ 15వ తేదీన షార్ట్ ఫిలింను రిలీజ్ చేయనున్నారు. కాగా తెలుగు, తమిళ్ ఇంకా హిందీలో కూడా రిలీజ్ చేయనున్నారు. దిల్ రాజ్ ప్రోడక్షన్స్ బ్యానర్ పై ఈ షార్డ్ ఫిలింను నిర్మిస్తున్నారు. ప్రముఖ సింగర్ శృతి రంజని ఈఫిలింకు సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: