నాని 30 అప్ డేట్ కి డేట్ ఫిక్స్

nani 30 movie update release date fixed

న్యాచురల్ స్టార్ నాని ఈ ఏడాది దసరా తో మంచి స్టార్టప్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు అదే జోష్ తో మరో సినిమాను రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాడు. నాని ప్రధాన పాత్రలో శౌర్యవ్ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. నాని 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఎమోషనల్‌ ఫ్యామిలీ డ్రామాగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇన్ని రోజులు షూటింగ్ తో బిజీగా ఉండగా ఇప్పుడు అప్ డేట్లు స్టార్ట్ చేశారు. ఈనేపథ్యంలోనే నాని రెండు రోజుల క్రితం రెడీ? అంటూ అప్ ఇచ్చాడు. దీంతో ఏం అప్ డేట్ ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా మరో పోస్ట్ చేశాడు నాని. రెడీ రెడీ? అంటూ ఈసారి డేట్ ను ఫిక్స్ చేస్తూ వెయిట్ చేయమని చెబుతున్నాడు. జులై 13వతేదీన ఈసినిమా నుండి అప్డేట్ రానుంది. మరి ఆ అప్ డేట్ ఫస్ట్ లుక్ పోస్టరా లేక టైటిల్ ను ఏమైనా రిలీజ్ చేస్తారా?లేక వేరే ఇంకేమైనా అప్ డేట్ ఉంటుందా అన్నది చూడాలి.

ఇక ఈసినిమాలో సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో నాని కూతురిగా బేబి కైరా ఖన్నా నటిస్తోంది. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా..హృదయం ఫేమ్‌కు చెందిన ప్రముఖ మలయాళ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈసినిమాను వైరా ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సి.వి.మోహ‌న్‌, డాక్ట‌ర్ విజేందర్ రెడ్డి తీగ‌ల‌, మూర్తి కె.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. ఈసినిమాను డిసెంబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 17 =