బ్రో ఫస్ట్ సాంగ్ పై థమన్ రియాక్షన్

thaman respond on bro first song

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సుప్రీం హీరో సాయి తేజ్ కలిసి నటిస్తున్న బ్రో విడుదలకు మరి కొన్నిరోజుల సమయం మాత్రమే వుంది.ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే విడుదలైన టీజర్,పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి.ఇక రీసెంట్ గా రిలీజైన ఈసినిమాలోని మొదటి సాంగ్ మై డియర్ మార్కండేయ కూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.అయితే ఈ సినిమా గురించి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తాజాగా జరిగిన మీడియా మీట్ లో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్రో మూవీకి మాస్ బీట్ సాంగ్స్ ఇవ్వలేం ఎందుకంటే సబ్జెక్టు అలాంటింది.కథలను బట్టే స్వరాలు సమకూర్చాలి మార్కండేయ పాటని సామెతలు గానే చెప్పాలి అందుకే ట్యూన్స్ కూడా అలాగే ఉంటాయి. బ్రో ఆడియో సాఫ్ట్ గా వున్నా నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోతుంది.అవకాశం ఉంటేనే పెద్ద సాంగ్స్ చేయగలం ప్రతిసారి అలాంటి సాంగ్స్ మాత్రమే కావాలంటే ఎలా అని థమన్ అన్నారు.

సముద్రఖని డైరెక్ట్ చేస్తున్న ఈసినిమాకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే,మాటలు అందిస్తుండగా  ప్రియా ప్రకాష్ వారియర్,కేతిక శర్మ,బ్రహ్మజీ,తణికెళ్ల భరణి,రోహిణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా,మై డియర్ మార్కండేయ సాంగ్ లో కనిపించనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ,జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమా ఈనెల 28న థియేటర్లకి రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 12 =