థియేటర్లలో ఈ వారం రిలీజ్ అవనున్న సినిమాలు

telugu-movies-to-be-released-in-theaters-this-week

ఈ వారం థియేటర్లలో కొన్ని కొత్త సినిమాలు సందడి చేయనున్నాయి. అయితే వీటిలో డబ్బింగ్ అయిన సినిమాలే ఎక్కువ ఉండనున్నాయి. తెలుగు స్టార్ హీరోల సినిమాలు కాకపోయినప్పటికీ.. ఇతర భాషలకు చెందిన ప్రముఖ నటులు, తెలుగువారికి పరిచయమైనవారు నటించినవి కావడం, మరియు మంచి కంటెంట్‌తో వస్తున్నట్లు ఆయా చిత్రాల యూనిట్లు ఇప్పటికే ప్రకటించడంతో ఈ సినిమాలపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలు ఏంటో ఇక్కడ చూద్దాం..!

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘బేబీ’ మూవీ

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా ‘బేబీ’. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ ముమ్మురంగా ప్రమోషన్స్‌ చేస్తోంది. టాలీవుడ్ యువ నటుడు విరాజ్‌ అశ్విన్ కూడా మరో లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు. ఇక ఈ మూవీలో వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా సంపూర్ణేష్ బాబు డెబ్యూ మూవీ ‘హృదయ కాలేయం’ ఫేం సాయిరాజేశ్‌ డైరెక్ట్ చేస్తుండటం విశేషం. వాస్తవిక ప్రపంచంలోని వ్యక్తులను ప్రతిబింబించే మూడు ప్రధాన పాత్రల చుట్టూ తిరిగే ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరీ అని, ప్రజెంటేషన్‌ పూర్తిగా కొత్తగా ఉంటుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. అలాగే ‘బేబీ’ క్లైమాక్స్ ఎవరూ ఊహించని విధంగా అనూహ్యంగా ఉంటుందని కూడా తెలిపింది. ఇక ఇప్పటికే బేబి నుంచి లాంఛ్ చేసిన పాటలకు, టీజర్‌, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా జులై 14న థియేటర్లలో సందడి చేయనుంది.

‘మహావీరుడు’ మూవీ

ప్రముఖ తమిళ నటుడు శివ కార్తికేయన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మహావీరుడు’. ఫాంటసీ జోనర్‌లో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందిస్తుందని, వారిని ఆశ్చర్యపరిచే అంశాలెన్నో ఇందులో ఉంటాయని హీరో శివ కార్తికేయన్‌ తాజాగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో తెలిపారు. అలాగే టాలీవుడ్ నటుడు సునీల్‌ మరియు సీనియర్‌ నటి సరిత ఈ చిత్రంలో కీలకమైన పాత్రలను పోషించడం విశేషం. ఇంకో విశేషం ఏంటంటే..? దిగ్గజ దర్శకుడు శంకర్ కుమార్తె అదితీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక శాంతి టాకీస్ పతాకంపై అరుణ్‌ విశ్వ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఏషియన్‌ సినిమాస్‌ తెలుగులో విడుదల చేస్తోంది. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమాకు ‘మండేలా’ మూవీ ఫేమ్ మడోన్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

‘నాయకుడు’ మూవీ

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు, నటుడు ఉద‌య‌నిధి స్టాలిన్‌ తాజాగా నటించిన చిత్రం ‘నాయకుడు’. ‘మామ‌న్న‌న్’ అనే లేటెస్ట్ త‌మిళ్ హిట్ మూవీని ‘నాయకుడు’ పేరుతో తెలుగులోకి అనువదించి విడుదల చేస్తున్నారు. ఫ‌హాద్ ఫాజిల్ విలన్ పాత్ర‌లో నటిస్తుండటం విశేషం. ‘మహానటి’ ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ‘మారి’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న సెల్వ‌రాజ్ ద‌ర్శ‌క‌త్వం వహించాడు. సామాజిక ఇతివృత్తంతో రూపొందిన ఈ సినిమాలో త‌మిళ సీనియ‌ర్ క‌మెడియ‌న్ వ‌డివేలు త‌న పంథాకు భిన్నంగా ఎమ్మెల్యేగా సీరియ‌స్ రోల్‌లో న‌టించాడు. కాగా ఏసియ‌న్ ఫిల్మ్స్‌, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా తెలుగులో విడుదల చేస్తున్నారు. జూలై 14న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ – పార్ట్ 1

ప్రపంచవ్యాప్తంగా యాక్షన్ ప్రియులకు ‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్ లోని సినిమాలు సుపరిచితమే. హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం మిషన్ ఇంపాజిబుల్: డెడ్ రెకనింగ్ – పార్ట్ 1. క్రిస్టోఫర్ మెక్‌క్వారీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ‘మిషన్ ఇంపాజిబుల్’ సిరీస్ లో 7వది కావడం గమనార్హం. టామ్ క్రూజ్ మరియు తన బృందంతో చేసే ఉత్కంఠభరితమైన, యాక్షన్-ప్యాక్డ్ ఆపరేషన్ కోసం ప్రేక్షకులు కూడా అంతే ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అసాంఘిక శక్తుల చేతుల్లో పడిన మానవాళిని అంతమొందించే అణు బాంబులను నిర్వీర్యం చేసే ప్రయత్నమే ఈ సినిమా. అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు (జులై 12, 2023) విడుదల అవుతోంది. ఇక మనదేశంలో అయితే ఏకంగా 2500 స్క్రీన్‌లలో విడుదల అవుతుండటం విశేషం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 15 =