రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్.. ఈ కాంబినేషన్ కోసం ఎంతో మంది ఎప్పటినుండో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి హీరోలతో రాజమౌళి ఇప్పటికే రెండు మూడు సినిమాలను తీశాడు. కానీ మహేష్ బాబు తో మాత్రం ఎందుకో ఇంతవరకూ సినిమా తీయలేదు. అయితే త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ నుండి సినిమా రాబోతుంది. అంతేకాదు ఈసినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈకథను సిద్దం చేస్తున్నారు. అంతేకాదు ఫారెస్ట్ అడ్వెంచరస్ నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలాా ఉండగా ఈసినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈసినిమా కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈలిస్ట్ లోకి టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ కూడా చేరిపోయాడు. నిఖిల్ హీరోగా తెరకెక్కిన స్పై మూవీ ఇప్పటికే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా మహేష్-రాజమౌళి సినిమా గురించి మాట్లాడుతూ.. ఈసినిమా కోసం చాలా ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నానని.. ముందే మహేష్ బాబుగారు అందంగా ఉంటారు.. ప్రతి ఒక్కరూ ఆయనతో ప్రేమలో పడిపోతూ ఉంటారు.. అలాంటిది స్పై అవతార్ లో ఎలా ఉంటారా అని చూస్తున్నా..ఈమధ్య ఆయన ఫొటో షూట్ ఒకటి చూశా.. రాజమౌళి సినిమా లుక్ కోసమా అనుకున్నాను చూడాలి అంటూ తెలిపాడు.
View this post on Instagram
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: