ఇళయదళపతి విజయ్ కు తమిళ్ తో పాటు తెలుగులో కూడా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే విజయ్ నుండి సినిమా వస్తుందంటే తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తికరంగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమా వస్తుంది.
ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచే దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక నేడు విజయ్ పుట్టినరోజు అన్న సంగతి తెలిసిందే కదా. ఈ రోజు కోసం విజయ్ అభిమానులు ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా విజయ్ బర్త్ డే కి అప్ డేట్ వస్తుందని తెలిసిన దగ్గరనుండి మరింత వెయిట్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఇక పోస్టర్ లో విజయ్ విలన్ గ్యాంగ్ తో ఫైట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. విజయ్‌తో పాటు పక్కనే ఓ తోడేలు అలానే మంచు కొండలు, ఊడిన పళ్లు, చేతిలో సుత్తి, గాల్లో రక్తం కనిపిస్తున్నాయి. ఆసక్తికరంగా ఉన్న పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఇక ఈ సాయంత్రం ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది.
#LeoFirstLook is here! Happy Birthday @actorvijay anna!
Elated to join hands with you again na! Have a blast! 🤜🤛❤️#HBDThalapathyVIJAY #Leo 🔥🧊 pic.twitter.com/wvsWAHbGb7— Lokesh Kanagaraj (@Dir_Lokesh) June 21, 2023
ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో సంజయ్ దత్, మిస్కిన్, గౌతమ్ మీనన్, అర్జున్ సర్జ, ప్రియా ఆనంద్, ఇంకా మాథ్యూ థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేస్తున్నారు. సతీశ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా.. అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు. ఈసినిమా తమిళ్ తోపాటు ఇతర భాషల్లో అక్టోబర్ 19న విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: