అక్కడ అదరగొడుతున్న బాక్   

Aranmanai4 is doing very well at the TN Box Office
ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ సుందర్ సి అరణ్ మనై 4 తమిళనాడు లో అదరగొడుతుంది. గత శుక్రవారం విడుదలైన ఈసినిమా తమిళనాడు లో మూడో రోజుల్లో 23కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుని  సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను దక్కించుకుంది. గత కొన్ని నెలలుగా సరైన సినిమాలు లేక తమిళనాడు బాక్సాఫీస్ వెలవెలబోయింది.రీసెంట్ గా వచ్చిన  అరణ్ మనై 4  బిగ్ రిలీఫ్ ను ఇచ్చిందని చెప్పొచ్చు.
 
ఈసిరీస్ లో వచ్చిన మొదటి రెండు సినిమాలు బాగానే పెర్ఫర్మ్ చేసినా మూడో సినిమా మాత్రం నిరాశపరించింది.అయితే ఆ ఎఫెక్ట్ అరణ్ మనై 4 మాత్రం పడలేదు.అంచనాలకు మించి ఈసినిమా  వసూళ్లను రాబట్టుకుంటుంది. 
 
ఇక ఈసినిమా తెలుగులో కూడా విడుదలైయింది.బాక్  గా వచ్చిన  ఈసినిమా ఇక్కడ కూడా  డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది. దాదాపు 2కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుంది తమన్నా, రాశి కన్నా ,సుందర్ సి లీడ్ రోల్స్ లో నటించిన ఈసినిమాలో కోవై సరళ, యోగిబాబు,రాజేంద్రన్ కీలకపాత్రల్లో కనిపించారు.హిప్ హాఫ్ తమిళ సంగీతం అందించాడు. 
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.