శ్రీవిష్ణు హీరోగా గత ఏడాది వచ్చిన సినిమా సామజవరగమన. కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మంచి హిట్ ను అందించింది. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా చిన్న సినిమాగానే 2023 జూన్ 28న విడుదలైంది. కేవలం మౌత్ టాక్‌తోనే ఈసినిమా ప్రేక్షకాదరణ పొందింది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందుకుంది. ఈసినిమాలో రెబా మోనికా జాన్ హీరోయిన్గా నటించగా.. ఇంకా వెన్నెల కిశోర్, నరేశ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్, హాస్య మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించగా.. గోపీ సుందర్ ఈసినిమాకు సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమాకు అరుదైన గౌరవం దక్కింది. దివంగత దాసరి నారాయణ రావు జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం డీఎన్ఆర్ ఫిల్మ్స్ అవార్డ్స్ పేరిట అవార్డులు ఇస్తారన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో తాజాగా ఈ అవార్డులను ప్రకటించారు. దీనిలో భాగంగానే సామజవరగమన సినిమాకు ఉత్తమ వినోదాత్మక చిత్రంగా అవార్డ్ దక్కింది. ఈ అవార్డును చిత్ర నిర్మాత రాజేష్ దండా, సినీయర్ హీరో మురళి మోహన్, అగ్ర నిర్మాత అల్లు అరవింద్ చేతుల మీదుగా అందుకున్నాడు డైరెక్టర్.
We’re ecstatic to announce that our film #Samajavaragamana has been awarded with the 𝐁𝐞𝐬𝐭 𝐞𝐧𝐭𝐞𝐫𝐭𝐚𝐢𝐧𝐢𝐧𝐠 𝐟𝐢𝐥𝐦 award at Darsaka Rathna DNR Awards❤🔥
Our producer @RajeshDanda_ received the honour ✨❤️@sreevishnuoffl @Reba_Monica @RamAbbaraju @GopiSundarOffl pic.twitter.com/Q9xAAKPgJk
— Hasya Movies (@HasyaMovies) May 8, 2024
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: