తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్, బాలీవుడ్ ఇంకా హాలీవుడ్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలను కవర్ చేస్తూ సినిమాలను చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే టాలీవుడ్ లోకి సార్ అనే స్ట్రైయిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఇక దీనితోపాటు పలు సినిమాలు చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో హిందీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా ఈసినిమా వస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో రాంఝానా అనే సినిమా వచ్చింది. ఈసినిమా వచ్చి పదేళ్లు అయిపోయింది. ఇక ఈసినిమా వచ్చి పదేళ్లు అయిన నేపథ్యంలో కొత్త సినిమాను ప్రకటిస్తూ గ్లింప్స్ తో పాటు టైటిల్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక గ్లింప్స్ లో ధనుష్ ను చూస్తుంటే డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. పొడవాటి జుట్టు, గడ్డంతో డిఫరెంట్ గా కనిపిస్తున్నాడు.
Har har Mahadev 🙏🙏 My next Hindi film. https://t.co/mQeUXyi3dh pic.twitter.com/Abi7ajgaFx
— Dhanush (@dhanushkraja) June 21, 2023
కాగా కలర్ ఎల్లో ప్రొడక్షన్ బ్యానర్‌పై ఆనంద్ ఎల్ రాయ్, హిమాన్షు శర్మ తేరే ఇష్క్ మే ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఏఆర్ రెహమెన్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు. స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ను హిమాన్షు శర్మ, హేమంత్ యాదవ్ కలిసి అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: