పవర్ స్టార్ కు సపోర్ట్ గా మెగాస్టార్, సినీ సెలబ్రిటీలు

chiranjeevi and tollywood celebrities supportive posts for pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎలక్షన్స్ బిజీలో ఉన్న సంగతి తెలిసిందే కదా. పలు సినిమాలు తన లిస్ట్ లో ఉన్నా కూడా షూటింగ్ లను మధ్యలోనే ఆపేసి తన ఫోకస్ మొత్తం రాజకీయాలపైనే పెట్టారు. ఇక ఎన్నికలకు ఎన్నో రోజులు లేకపోవడంతో ఎండలను సైతం లెక్కచేయకుండా వరుసగా సభలు నిర్వహిస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ గెలుపుకోసం కూడా పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే తాను పోటీ చేస్తున్న నియోజకవర్గానికి వెళ్లి విస్త్రృత ప్రచారం చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుండి ఇప్పటికే నాగబాబు, ఆయన సతీమణి, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయిధరమ్ తేజ్ ప్రచారంలో పాల్గొనగా.. హైపర్ ఆది, సుధీర్, రాంప్రసాద్, గెటప్ శ్రీను తో పాటు ఇంకా చాలామంది సెలబ్రిటీలు ఇంటింటికి వెళ్లి పవన్ ను గెలిపించాలని కోరుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ఎంతమంది వచ్చినా మెగాస్టార్ చిరంజీవిపైన అందరి ఫోకస్ ఉంటుంది. మెగాస్టార్ ఇంకా రాలేదు అన్న ప్రశ్నలే వినిపిస్తాయి. కానీ ఇప్పుడు మెగాస్టార్ కూడా వచ్చేసారు. పవన్ ను గెలిపించాలని సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో మెగాస్టార్.. తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి బలవంతంగా వచ్చినా రాజకీయాల్లోకి మాత్రం ఇష్టంగానే వచ్చాడు.. ఏ తల్లికైనా సరే తన కొడుకు కష్టపడుతుంటే బాధగా ఉంటుంది, తమ్ముడి అకారణంగా తిడుతుంటే బాధగా ఉంటుంది.. కానీ నేను అమ్మకు ఒకటే మాట చెప్పాను. ఎంతో మంది తల్లుల కోసం, బిడ్డల కోసం చేస్తున్న ఈ పోరాటంలో.. మన బాధ పెద్దది కాదు అని అన్నాను. పవన్ లాంటి నాయకులను చట్ట సభలకు పంపించాలని.. జన సేనకు ఓటు వేయండని మెగాస్టార్ కోరారు.

ఇంకా నాని కూడా పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ గా తన ట్విట్టర్ ద్వారా విషెస్ అందించారు. డియర్ పవన్ కల్యాణ్ గారు.. మీరు పెద్ద రాజకీయ యుద్దాన్ని ఎదుర్కొనబోతున్నారు. మీ సినీ కుటుంబ సభ్యుడిగా మీరు కోరుకున్నది సాధించాలని నేను కూడా కోరుతున్నా. మీరు మీ ప్రామిస్‌లను నెరవేర్చుతారని ఆశిస్తున్నా. నేను మీ విజయం కోసం చూస్తున్నా. అందరూ మీకు మద్దతు నిలుస్తారని అనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్ అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.

రాజ్ తరుణ్ కూడా తన సపోర్ట్ ను అందించాడు. ఆంధ్ర ప్రదేశ్ పట్ల మీకున్న విజన్, కష్టపడుతున్న తీరుని నేను మొదటినుండీ గమనిస్తూనే ఉన్నాను.. కోట్ల మంది ఆశిస్తున్నట్టుగా నేను కూడా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నాను. ఉజ్వల భవిష్యత్‌ను అందిస్తారని, మార్పు తీసుకొస్తారని ఆశిస్తున్నాను.. ఇప్పుడు జనాలకి నువ్వు కావాలి అంటూ రాజ్ తరుణ్ పోస్ట్ చేశాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.