ఈ ఏడాది వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ఆసినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఆ వెంటనే మరో సినిమాను మొదలుపెట్టేశాడు. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఈసినిమాను ఈ ఏడాదే మొదలుపెట్టారు. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. అయితే షూటింగ్ మొదలుపెట్టిన దగ్గర నుండి ఇప్పటివరకూ ఎలాంటి బ్రేక్ లు లేకుండా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటూ వస్తున్నారు. దాదాపు ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ ను చెన్నైలో రెండు రోజుల క్రితమే మొదలుపెట్టారు. అక్కడ వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఒక పాటను చిత్రీకరించనున్నట్టు తెలుస్తుంది. ఇది విజయ్ ఇంట్రడక్షన్ సాంగ్ అని.. ఈ పాటలో 500 మంది డాన్సర్లు కనిపించనున్నారని అంటున్నారు. ఈ ఒక్క పాటనే రెండు వారాల పాటు చిత్రీకరించనున్నారని చెబుతున్నారు. దినేశ్ మాస్టర్ ఈ పాటకి కొరియోగ్రఫీని అందిస్తున్నాడు. అనిరుధ్ అందించిన ఈపాట ఒక రేంజ్ లో దూసుకెళుతుందని అంటున్నారు.
ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో సంజయ్ దత్, మిస్కిన్, గౌతమ్ మీనన్, అర్జున్ సర్జ, ప్రియా ఆనంద్, ఇంకా మాథ్యూ థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాకు ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తుండగా జగదీష్ పళనిసామి సహ నిర్మాతగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పనిచేస్తున్నారు. సతీశ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా.. అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: