సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా వస్తున్న సినిమా ‘ఏజెంట్’. స్పై థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో అఖిల్ పూర్తిగా తన లుక్ మార్చేశాడు.. సిక్స్ ప్యాక్ బాడీతో ఆకట్టుకోనున్నాడు. ఈసినిమా ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టెసింది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు సినిమాపై ఆసక్తిని పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా నేడు ఈరోజు అఖిల్ బర్త్ డే అన్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆయనకు ఫ్యాన్స్, సెలబ్రిటీస్ బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. అయితే విశేషం ఏంటంటే సమంత కూడా అఖిల్ కు బర్త్ డే విషెస్ తెలియచేసింది. హ్యాపీ బర్త్ డే అఖిల్… ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న రాబోతోంది… చూస్తుంటే నిప్పులా కనిపిస్తోంది…. లాట్సాఫ్ లవ్ అంటూ ట్వీట్ చేసింది. మరి సమతం నాగ చైతన్య నుండి విడిపోయిన తరువాత అక్కినేని ఫ్యామిలీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే అఖిల్ కు మాత్రం గత ఏడాది కూడా బర్త్ డే విషెస్ తెలియచేసింది. ఇక ఇప్పుడు కూడా బర్త్ డే విషెస్ తెలియచేసింది.
కాగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై అనీల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే వక్కంతం వంశీ అందించాడు. థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా రగుల్ హెరియన్ ధరుమన్ వ్యవహరిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: