మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరోల్లో సాయి ధరమ్ తేజ్ కూడా తన నటనతో, సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. ఇప్పుడు డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను అలరించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. రిపబ్లిక్ లాంటి మెసేజ్ ఒరియెంటెడ్ సినిమా తరువాత తన నుండి వస్తున్న సినిమా విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకత్వంలో మిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది.ఈసినిమా ప్రమోషన్స్ ను ఇప్పటికే మొదలుపెట్టేశారు చిత్రయూనిట్. ఏప్రిల్ 21వ తేదీన ఈసినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో మంత్ ఆఫ్ విరూపాక్ష పేరుతో రిలీజ్ వరకూ వరుసగా అప్ డేట్లు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, పాటలు, పోస్టర్లు రిలీజ్ చేస్తూ వస్తుండగా సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. దీంతో సినిమా పై కూడా ఆసక్తి పెరిగింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
రీసెంట్ గానే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ట్రైలర్ ను ఏప్రిల్ 11వ తేదీన ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
Get ready to be spellbound as you walk into the World of Thrill & Mystery 👁@IamSaiDharamTej‘s #VirupakshaTrailer tomorrow at 11:07AM 💥@iamsamyuktha_ @karthikdandu86 @AJANEESHB @Shamdatdop @NavinNooli @bkrsatish @SVCCofficial @SukumarWritings#Virupaksha #VirupakshaOnApril21 pic.twitter.com/xL9QWh86Rd
— SVCC (@SVCCofficial) April 10, 2023
కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ కథానాయిక గా నటిస్తుంది. ఇంకా ఈసినిమాలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు పలు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈసినిమాకు కాంతార సెన్సేషన్ అంజనీష్ లోక్ నాథ్ సంగీతం అందించనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: