అల్లు అర్హ కి తెలుగు తప్ప ఇంకేం నేర్పలేదు- గుణశేఖర్ 

Gunasekhar Great words about Allu Arjun Daughter Allu Arha

రుద్రమదేవి తరువాత చాలా గ్యాప్ తీసుకొని ఈసారి శాకుంతలం అనే పురాణగాధని తెరకెక్కించాడు డైరెక్టర్ గుణశేఖర్. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే నాటకం ఆధారంగా శాకుంతలం అనే సినిమాను రూపొందించాడు. ఇందులో సమంత, శకుంతలగా నటించగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ,శకుంతల కుమారుడు భరతుడిగా కనిపించనుంది.ఇక ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూ లో గుణశేఖర్ ,అర్హ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రీ క్లైమాక్స్ లో భరతుడి పాత్రకు స్టార్ కిడ్ అయితే బాగుంటుందని అల్లు అర్జున్ ను సంప్రదించాం. సినిమాలో అర్హ పాత్ర ఏంటి అనేది చెప్పగానే బన్నీ నవ్వి..పెద్ద పెద్ద డైలాగులు వున్నాయి కదా ఎలా మరి అంటే ట్రేన్ చేద్దాం అని చెప్పగానే ఒప్పేసుకున్నాడు. అర్హ కి తెలుగు తప్ప ఇంకేం రాదు మాములు గా వాడే ఇంగ్లీష్ ఎలాగూ వస్తది కానీ తల్లిదండ్రులు,అర్హ కి ఒక్క ఇంగ్లీష్ పదం కూడా నేర్పకుండా కేవలం తెలుగు నేర్పించారు అందుకు వారిని అభినందించాలి. దాంతో సెట్ లో పని ఈజీగా అయిపొయింది. అర్హ డైలాగులు అద్భుతంగా చెప్పింది. స్మార్ట్ కిడ్, ఏంకావాలో తొందరగా అర్ధం చేసుకుని అది ఇస్తుంది. వండర్ కిడ్ అంటూ గుణశేఖర్, అర్హ పై ప్రశంసలు కురిపించాడు.

ఇదిలావుంటే శాకుంతలం ఈనెల 14న పాన్ ఇండియా మూవీ గా 2డితో పాటు 3డిలోనూ విడుదలకానుంది. ఈచిత్రంలో దేవ్ మోహన్ ,మోహన్ బాబు ,ప్రకాష్ రాజ్ తదితరులు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.భారీ బడ్జెట్ తో నీలిమ గుణ ఈసినిమాను నిర్మించగా మణిశర్మ సంగీతం అందించాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =