నెగిటివిటీ అనే చెడు మీద మంచి గెలిచింది

nani speech at dasara movie success celebrations event

న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన సినిమా దసరా. ఈసినిమా రిలీజ్ కు ముందే భారీ అంచనాలను ఏర్పరుచుకొని.. ఆఅంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండటంతో ఇప్పుడు ఈసినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కినా కూడా ఈసినిమా అందరికీ కనెక్ట్ అవుతుండటంతో అందరూ సినిమా చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈసినిమాలో నటీనటుల నటనపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా డైరెక్టర్ శ్రీకాంత్ మేకింద్ కు అందరూ ఫిదా అవుతున్నారు. అందుకే వారం రోజుల్లోనే 100 కోట్లు కలెక్ట్ చేసి నాని కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను అందిస్తుంది. ఈసినిమా సక్సెస్ సెలబ్రేషన్ వేడుకను కూడా ఇప్పటికే నిర్వహించారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దసరా బ్లాక్ బస్టర్ దావత్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ..ఈసినిమాను ఇంతపెద్ద బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. నాని అన్న లాంటి యాక్టర్ కి వంద కోట్ల పోస్టర్ చూడాలని కోరికగా వుంది అని శ్రీకాంత్, మా కో డైరెక్టర్ వినయ్ తో అన్నాడు. ఆ కోరిక ఈ వేదికపై తీరింది. ఈసినిమా సక్సెస్ ను చూస్తుంటే మా కడుపునిండిపోయింది. ఇప్పటివరకూ నేను నాకు తోచింది.. నా మనసుకు నచ్చింది చేస్తూ వచ్చాను. ఈ ప్రోసస్ లో నిరాశ పరిచిన వారు కూడా కొంతమంది వుంటారు. కానీ బలంగా నమ్మి మనస్పూర్తిగా దిగిపోయేవాడిని. నేను అలా దిగిపోయిన ప్రతిసారి మీరు సపోర్ట్, విజయాలు ఇచ్చి ఇంత గొప్పగా ప్రోత్సహిస్తుంటే ఆ నమ్మకం పదింతలైపోయింది. మీ అందరికీ కలలు వుంటాయి. మీరు నమ్మితే బలంగా దిగండి. వెనక్కి లాగే వాళ్ళ కోసం పట్టించుకోవద్దు. ప్రాణం పెట్టి పని చేయండి. మీ కలలు తప్పకుండా నెరవేరుతాయి.

మీడియా, సోషల్ మీడియాలో ఒక కొత్త సినిమా విడుదలౌతుంటే ఇది బాగా ఆడితే బావుటుందని అనుకునే వారి కంటే, ఇది ఆడదని అనే వాళ్ళే ఎక్కువ వున్నారు. వాళ్ళందరిది తప్పు అని నిరూపించాలి. ఈ నెగిటివిటీ అనే చెడు మీద ఈ రోజు మంచి గెలిచింది. మన దసరా అనే మంచి గెలిచింది. దసరా అంటేనే చెడు మీద మంచి గెలవడం. ఈ గెలుపు ప్రేక్షకులందరిది. మీరంతా ఇంత గొప్పగా ఆదరించకపోయి వుంటే మేము పెట్టిన కష్టానికి ఫలితం వుండేది కాదు. మరోసారి ప్రేక్షకులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. దసరా ఎప్పటికీ గుర్తుపెట్టుకునే విజయం. దసరాకి ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది సపోర్ట్ చేశారు. మహేష్ బాబు గారు, ప్రభాస్ అన్న, రాజమౌళి గారు, సుకుమార్ గారు.. ఇలా ఇండస్ట్రీలో ఎంతో మంది దసరా గురించి గొప్పగా పోస్టులు పెట్టి మీ అందరికీ రీచ్ అయ్యేలా చేశారు. వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. మరోసారి ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు’’ తెలిపారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + six =