శాకుంతలంలో దుష్యంతుడి పాత్ర ఇదే.. 

Interesting News about Dushyanthudu Role In Shaakuntalam

గుణశేఖర్ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం శాకుంతలం విడుదలకు సిద్దమవుతుంది. ఈసినిమాలో సమంత టైటిల్ రోల్ లో నటించగా దేవ్ మోహన్,దుష్యంతుడి పాత్రలో కనిపించనున్నాడు.ఈసందర్బంగా దుష్యంతుడి ఎవరు ఆయన చరిత్ర ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చంద్రవంశీయుడైన దుష్యంత మహారాజు పరాక్రమశాలి, ధర్మనిరతుడు. అతనొక రోజు కారడవులలో తన వేట కొనసాగిస్తుండగా ఒక పులి బారి నుంచి కొందరు గ్రామస్తులను కాపాడి.. అనుకోకుండా ఒక ఆశ్రమ ప్రాంగణంలో అడుగుపెడతాడు. అది కణ్వ మహర్షి ఆశ్రమం. ఆశ్రమవాసుల విన్నపం మేరకు అక్కడ కొన్ని రోజులు సేద తీరడానికి ఆగిన దుష్యంతుడు ..అక్కడే యాగ రక్షకుడై నిలుస్తాడు.ఆశ్రమ ప్రాంగణంలో సంచరిస్తున్న దుష్యంతుడికి అక్కడ ప్రకృతి లోని అందం అంతా కలబోసినట్లు, విశ్వంలోని అందమంతా తన లోనే వికసించినట్లు శకుంతల దర్శనమిస్తుంది. శకుంతల కూడా అతని ప్రేమలో మునగడంతో దుష్యంతుడు శకుంతలని గంధర్వ వివాహం చేసుకుంటాడు. తన రాజ్యానికి వెళ్లి కొన్ని అత్యవసర పనులను పూర్తి చేసి వెంటనే ఆశ్రమానికి తిరిగి వచ్చి రాజ లాంఛనాలతో శకుంతలని తన రాజ్యానికి పట్టమహిషిగా తీసుకెళ్తానని మాటిచ్చి తన రాజ్యానికి బయలుదేరుతాడు దుష్యంతుడు.

నెలలు గడిచినా దుష్యంతుడి జాడ లేకపోవడంతో నిండు గర్భిణి అయిన శకుంతలను కణ్వ మహర్షి దుష్యంతుడి వద్దకు పంపుతాడు. కాని దుష్యంతుడు శకుంతలను గుర్తుపట్టక రాజ్యం నుంచి పంపివేస్తాడు. దుష్యంతుడి వంటి ధర్మమూర్తి, సత్యవంతుడు ఇంతటి వంచన చేయగలడా అన్నది ఒక పెద్ద ప్రశ్న. కానీ దీని వెనుక విధి ఆడిన వింత నాటకం ఉందన్నది సత్యం, పవిత్ర ప్రేమ, నమ్మకం, క్రోధం, వందన, పశ్చాత్తాపం.. ఇన్ని నిండిన ఆ అభిజ్ఞాన శాకుంతలాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించే చిత్రం శాకుంతలం. ఈ దుష్యంతుడి పాత్రలోనే దేవ్ మోహన్ కనిపించనున్నాడు.

శాకుంతలం రిలీజ్ ట్రైలర్ ఈ రోజు విడుదలైయింది. పాన్ ఇండియా మూవీగా రూపొందతున్న ఈచిత్రం  ఏప్రిల్ 14న ప్రేక్షకులముందుకు రానుంది. నీలిమ గుణ ఈసినిమాను నిర్మిస్తుండగా దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 3 =