ఈనెల14న శాకుంతలం థియేటర్లలోకి రానుంది. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా దర్శకుడు గుణశేఖర్ ఈసినిమాను తెరకెక్కించాడు.ఈసినిమాలో సమంత టైటిల్ రోల్ ను పోషించింది.ఈసందర్భంగా అసలు శకుంతల ఎవరు.. ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విశ్వామిత్రుడి కఠోర తపస్సును భంగం చేసి అతన్ని వలపించి ఒక బిడ్డకు జన్మనిచ్చింది అతిలోక సుందరి మేనక. కానీ దేవనర్తకి కావడం చేత భూలోకంలో ఉండలేక, తన కూతురిని స్వర్గానికి తీసుకెళ్ళలేక ఎంతో బాధతో తనని భూలోకంలో వదిలి వెళ్తుంది. ఆపసి బాలికను శాకుంతల పక్షులు, కణ్వ మహర్షి ఆశ్రమానికి చేర్చగా ఆయన ఆ బాలికకు ‘శకుంతల’ అని నామకరణం చేసి తన సొంత కూతురిలా పెంచి పెద్ద చేస్తాడు. ఒకనాడు ఆర్ష ఖండ సామ్రాట్ దుష్యంతుడు వేటకై అటువైపు రాగా కణ్వశ్రమంలో సేదతీరతాడు. ఆశ్రమ సందర్శనంలో ఉండగా దుష్యంతుని చూసిన శకుంతల అతని వీరత్వానికి ముగ్ధురాలై దుష్యంతుడి ప్రేమలో పడుతుంది. ప్రేమలో మునిగి తేలిన శకుంతలా,దుష్యంతులు గాంధర్వ వివాహం చేసుకుంటారు.తర్వాత దుష్యంతుడు రాజ కార్యం మీద తన రాజ్యానికి వెళ్లి తిరిగి వచ్చి తనని రాచ మర్యాదలతో మహారాణిగా తన రాజ్యానికి తీసుకువెళ్తానని మాట ఇవ్వగా.. తనని బాధతో సాగనంపుతుంది శకుంతల. దుష్యంతుడిచే గర్భవతి అయిన శకుంతల అతని రాకకై ఎదురుచూస్తూ నెలలు గడుపుతుంది.
ఎంతకీ దుష్యంతుడు రాకపోయేసరికి కణ్వ మహర్షి ధర్మనిరతుడై శకుంతలను దుష్యంతుడి రాజ్యానికి ధర్మ పత్నిగా పంపుతాడు.ఎన్నో ఆశలు పెట్టుకున్న శకుంతల,దుష్యంతుడు తనని మరిచాడనే చేదు వార్త తెలిసి భంగపడుతుంది. దుష్యంతుని వంటి ధర్మదీక్షాపరుడు ఇంతటి దారుణానికి ఎలా పూనుకున్నాడని సంద్రమాశ్చర్యాలు.. కలుగగానే దానికి కారణమైన ఒక కఠోర సత్యం వెలుగు చూస్తుంది.శకుంతల తన ప్రేమ, నమ్మకం,అవమానం,ఆత్మగౌరవం మధ్య విలవిలలాడుతూ కోనలలో ఒక మగ బిడ్డకు జన్మనిస్తుంది. తనే భరతుడు. ఆబిడ్డ తనకే కాక మొత్తం దేశానికి దిశా నిర్దేశకుడవుతాడనేది విధి.అది శకుంతల జీవితాన్ని మలుపు తిప్పిన సత్యం.అభిజ్ఞాన శాకుంతలంలోని అద్భుత సౌందర్యవతి అయిన శకుంతలగా, శాకుంతలం సినిమాలో సమంత కనిపించనుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: