శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం లో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన బలగం మూవీ మార్చి 3 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో సుధాకర్ రెడ్డి, జయరాం, మురళీ ధర్, విజయలక్ష్మి, మొగిలి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీకి భీమ్స్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బలగం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ సిరిసిల్లలోని బతుకమ్మ ఘాట్ వద్ద నిన్న గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు మున్సిపల్, ఐ టి మినిష్టర్ కెటిఆర్ చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. యంగ్ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ , సుడిగాలి సుధీర్ ఆ ఈవెంట్ లో పాల్గొన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ .. ముందుగా కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాననీ , సిరిసిల్లలో ఈ సినిమా షూటింగు జరగడానికి అందరూ కూడా ఎంతో సహకరించారనీ , తెలంగాణ నేపథ్యంలో గతంలో వచ్చిన ఒసేయ్ రాములమ్మా , ఫిదా వంటి సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయనీ , అలాగే ఈ సినిమాకి కూడా ఆ స్థాయి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నాననీ , బలగం మూవీ సిరిసిల్లలోని ఒక కుటుంబం చుట్టూ తిరిగే కథ అనీ , మా సంస్థ నుంచి పరిచయమవుతున్న పదో దర్శకుడు వేణుఅనీ , ఈ సినిమాను తాను చాలా అద్భుతంగా ఆవిష్కరించాడనీ , బొమ్మరిల్లు, శతమానం భవతి మాదిరిగా మా సంస్థకి మంచి పేరు తెస్తుందని ఆశిస్తున్నాననీ , ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మన గుండెకాయ లాంటి సినిమా అనీ చెప్పారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: