తమిళ స్టార్ హీరో ధనుష్ విభిన్నమైన, విలక్షణమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు సార్ సినిమాతో మరోసారి తన టాలెంట్ ను చూపించాడు. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వచ్చిన సినిమా సార్. తెలుగులో సార్ టైటిల్ తో రిలీజ్ అవ్వగా.. తమిళ్ లో వాతి టైటిల్ తో రిలీజ్ అయింది. ఈసినిమాలో విద్యా సంస్థల్లో జరిగే మోసాల గురించి.. కార్పొరేట్ విద్యా సంస్థల ఆదిపత్యం గురించి ఈసినిమాలో చూపించారు. ఇక ఈసినిమా మొదటి షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ధనుష్ సెటిల్డ్ నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందిస్తుంది. కేవలం మూడు రోజుల్లోనే ఈసినిమా 50 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. తెలుగు వెర్షన్ సార్ మరియు తమిళ వెర్షన్ వాతి కలిసి ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 51 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. ఇక ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది. ఇందుకు సంబంధించిన వసూళ్ల పోస్టర్ ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.
కాగా ఈసినిమాలో ధనుష్ కు జోడీగా సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించింది. ఇంకా సముద్రఖని, సాయికుమార్,తనికెళ్ల భరణి , హైపర్ ఆది తదితరులు కీలక పాత్రల్లో నటించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై ఈసినిమాను నిర్మించారు. ఇక ఈసినిమాకు జి.వి. ప్రకాష్‌కుమార్ సంగీతం అందించగా.. సినిమాటోగ్రాఫర్ గా దినేష్ కృష్ణన్ పనిచేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: