డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆర్ ఆర్ ఆర్మూవీ నుండి కీరవాణి కంపోజ్ చేసిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.మార్చి 12న జరుగనున్న ఆస్కార్ అవార్డుల ఈవెంట్ కోసం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యుఎస్ఏ బయల్దేరి వెళ్లారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి రామ్ చరణ్ చేరుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలో రాజమౌళి, ఎన్టీఆర్ సహా ఇతర యూనిట్ సభ్యులు కూడా అక్కడికి చేరుకోనున్నట్లు సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: