క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ మేకింగ్ గురించి ప్రత్యేంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు శాకుంతలం సినిమాతో మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేయడానికి వచ్చేస్తున్నాడు. గుణశేఖర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి వరుసగా పాటలు రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే మొదటి పాటగా మల్లికా, మల్లికా, రెండో పాటగా రుషివనంలోన అనే పాటను రిలీజ్ చేయగా.. రెండు పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మూడో పాటను రిలీజ్ చేయనున్నారు. ఈసినిమా నుండి ఏలేలో ఏలేలో అనే పల్లవితో సాగే మూడవ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఫిబ్రవరి 1వ తేదీన ఈపాటను విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రలో నటిస్తుండగా.. అదితి బాలన్ అనసూయగా, మోహన్ బాబు మహర్షి, అల్లు అర్హ ప్రిన్స్ భరత్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను గుణశేఖర్ తన స్వంత బ్యానర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈసినిమాను కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను మొత్తం 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా శాకుంతలం మూవీని రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈసినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: