పూరీ జగన్నాథ్ సినిమా బద్రితో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్ రేణూ దేశాయ్. ఆతరువాత పవన్ తోనే మళ్లీ జాని అనే సినిమాలో నటించింది. కేవలం రెండు సినిమాల్లోనే నటించిన రేణు పవన్ కళ్యాణ్ ను పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్నేళ్లు కలిసి ఉన్న వీరు ఆ తరువాత విడిపోయారు. ఇక చాలా ఏళ్లు గ్యాప్ తీసుకోని ఈమధ్యే మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి రెడీ అవుతున్నారు. వంశీ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాలో రేణూ దేశాయ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాలో హేమలతా లవణం అనే పాత్రలో నటిస్తుంది. టైగర్ నాగేశ్వరరావు కి స్ఫూర్తిని రగిలించే పాత్రలోనే రేణు దేశాయ్ కనిపించబోతుందట. ఇక కొంత కాలంగా ఈసినిమా షూటింగ్ లో రేణూ దేశాయ్ కూడా పాల్గొంటుంది. ఇప్పుడు తన పార్ట్ కు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఈనేపథ్యంలో తాజాగా తన ఇన్ట్సా ద్వారా చిత్రయూనిట్ కు థ్యాంక్స్ చెబుతుంది రేణు దేశాయ్. ఈసినిమాలో కీలక పాత్రను ఇచ్చినందుకు థ్యాంక్స్.. సెట్‌లో తనను అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్ లా ప్రతిరోజు కంఫర్టబుల్‌గా చూసుకున్నందుకు టీమ్ మొత్తానికి ధన్యవాదాలు అని పోస్ట్ లో తెలిపారు.
View this post on Instagram
కాగా ఈసినిమాలో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నాడు. రవితేజ కెరీర్ లో ఆయన నటిస్తున్న మొట్టమొదటి బయోపిక్ అలానే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కూడా ఇదే కావడం విశేషం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: