ప్రస్తుతం తమిళ్ హీరోలు కూడా డైరెక్ట్ గా తెలుగులో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక అందులో విలక్షణ నటుడు ధనుష్ కూడా ఉన్నాడు. ఇప్పటికే ధనుష్ సార్ అనే సినిమా చేస్తున్నాడు. వెంకీ అట్లూరీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాప్రస్తుతం షూటింగ్ పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ కూడా రిలీజ్ చేసేశారు కూడా. ఈ సినిమాలో సంయుక్త హీరోయిన్ గా నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై ఈసినిమాను నిర్మిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా కూల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ధనుష్ తో కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై నారాయణదాస్ కె నారంగ్, పి. రామ్మోహన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈసినిమాపై కూడా ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ ఉన్నారు. ఇక ప్రస్తుతం అయితే ధనుష్ పలు సినిమాలతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ లేట్ అయింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈసినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి మేకర్స్ టైమ్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి స్టార్ట్ చేయనున్నారట.
కాగా ఇప్పటివరకూ శేఖర్ కమ్ముల కమర్షియల్ సినిమాలకు కాస్త దురంగానే ఉన్నాడని చెప్పొచ్చు.. కూల్ గా ఉండే లవ్ స్టోరీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే శేఖర్ కమ్ములతో ధనుష్ తో ఎలాంటి సినిమా చేస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే గతంలో ధనుష్ తో థ్రిల్లర్ సినిమా చేస్తున్నట్టు తెలిపాడు శేఖర్ కమ్ముల. చూద్దాం మరి ధనుష్ కోసం ఎలాంటి కథను సిద్దం చేస్తున్నాడో శేఖర్ కమ్ముల.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: