మరో రేర్ ఫీట్ అందుకున్న విక్రమ్

kamal haasan vikram movie to be screened at busan international film festival, busan international film festival, kamal haasan vikram movie, vikram movie, kamal haasan Latest Movie, kamal haasan's Upcoming Movie, international film festival, 2022 Busan International Film Festival, vikram, vikram Telugu movie, vikram New Update, vikram Telugu Movie New Update, vikram Movie, vikram Latest Update, vikram Movie Updates, vikram Telugu Movie Live Updates, vikram Telugu Movie Latest News, vikram Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా వచ్చిన సినిమా విక్రమ్. ఎన్నో అంచనాల మధ్య జులై3వ తేదీన రిలీజ్ అయిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఈసినిమా కమల్ కెరీర్ బెస్ట్ హిట్ ను అందిచడమే కాదు.. త‌మిళంలో ‘బాహుబ‌లి-2’ రికార్డును బ్రేక్ చేసి కోలీవుడ్ లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అంతేకాదు కలెక్షన్స్ విషయంలో ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్స్ ను ఈసినిమా సాధించింది. ఇక తెలుగులో కూడా ఈసినిమా మంచి కలెక్షన్స్ అందించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇప్పుడు ఈ సినిమా మరో అరుదైన రేర్ ఫీట్ ను సొంతం చేసుకుంది. అదేంటంటే ఈసినిమా బూసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో స్పెషల్ గా స్క్రీనింగ్ కు ఎంపికైంది. ప్రతి ఏడాది ఈ ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది. ప్రతి ఏడాది మాదిరిగా ఈ ఏడాది కూడా జరిగే బూసాన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో విక్రమ్ స్పెషల్ గా స్క్రీనింగ్ కానుంది. అక్టోబర్ 5-14 వరకు జరగనున్న ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అక్టోబర్ 7 మరియు అక్టోబర్ 8న విక్రమ్ చిత్రాన్ని స్పెషల్ స్క్రీనింగ్ చేయనున్నారు. దీంతో ఈ సినిమాను అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్క్రీనింగ్ చేస్తుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.

యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రంలో మ‌ల‌యాళ స్టార్ ఫాహాద్ ఫాజిల్‌, తమిళ స్టార్ విజ‌య్ సేతుప‌తి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. సూర్య రోలెక్స్ అతిథి పాత్రలో నటించినా.. సూర్య పాత్ర సినిమాకే హైలేట్ అని చెప్ప‌వ‌చ్చు. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రాజ్ క‌మ‌ల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై ఆర్. మహేంద్ర‌న్‌తో క‌లిసి క‌మ‌ల్ సంయుక్తంగా నిర్మించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 16 =