ఓరి దేవుడా మరో రోల్ రివీల్

Asha Bhat role revealed from ori devuda movie, Asha Bhat role In ori devuda movie, Vishwak Sen And Mithila Palkar's ori devuda movie, Vishwak Sen, Mithila Palkar, Asha Bhat, Ashwath Marimuthu, Vishwak Sen's ori Devuda Movie, Vishwak Sen Latest Movie, Vishwak Sen's Upcoming Movie, ori Devuda, ori Devuda Telugu movie, ori Devuda New Update, ori Devuda Telugu Movie New Update, ori Devuda Movie, ori Devuda Latest Update, ori Devuda Movie Updates, ori Devuda Telugu Movie Live Updates, ori Devuda Telugu Movie Latest News, ori Devuda Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలలో విశ్వక్ సేన్ కూడా ఒకరు. ఈ నగరానికి ఏమైంది మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విశ్వక్ సేన్ ఆసినిమాతో మంచి గుర్తింపు ను తెచ్చుకున్నాడు. ఇక ఆతరువాత ఫలక్ నుమా దాస్ సినిమాకు దర్శకత్వం వహించి హీరోగా కూడా నటించి ఆ సినిమాతో ఒక్కసారి మాస్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయి యూత్ లో కూడా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత పలు సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు. తాజాగా విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. తమిళ్ లో సూపర్ హిట్ అయిన ఓమై కడవుల్ సినిమాకు ఈసినిమా రీమేక్. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, పాటలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇక తాజాగా ఈసినిమాలో నటిస్తున్న మరో పాత్రను పరిచయం చేశారు. ఈసినిమాలో ఆశాభట్ కూడా ఒక పాత్రలో నటిస్తున్నట్టు తెలిపారు.

కాాగా ఈ మూవీ లో విశ్వక్ సేన్ సరసన మిథిలా పాల్కర్‌ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. పివిపి సినిమా, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ల మీద పెరల్ వి పొట్లూరి, పరమ్ వి పొట్లూరి, దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నారు. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నారు. తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్న ఈసినిమాకు సినిమాటోగ్రఫి విధు. ఈసినిమా అక్టోబర్ 21 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 9 =